తెరాస ప్రభుత్వం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసి కి కీలక పదవిని కట్టబెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకుని రెండో సారి అధికారాన్ని చేపట్టింది తెరాస పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాకి సరిపడా సీట్లు గెలిచినప్పటికీ... కాంగ్రెస్ చెందిన ఎమ్మెల్యేలు కొందరు తెరాస తీర్థం పుచ్చుకోవటం తో కుదేలైంది కాంగ్రెస్. దీంతో 7 గురు ఎమ్మెల్యేలు ఉన్న తమకు ప్రతి పక్ష హోదా కల్పించాలని ఎంఐఎం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్బరుద్దీన్ ఓవైసీకి పిఎసి చైర్మన్ పదవిని కట్టబెట్టింది తెరాస ప్రభుత్వం. అయితే పీఏసీ చైర్మన్ పదవిని ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలకు ఇవ్వటం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. అయితే అక్బరుద్దీన్ ఓవైసీకి పిఎసి చైర్మన్ గా పదవి ఇవ్వడంతో ఎంఐఎం పార్టీని  ప్రధాన ప్రతిపక్షంగా అంగీకరించినట్లయింది. అయితే అధికార టీఆర్ఎస్ పార్టీకి ఎంఐఎం పార్టీకి స్నేహపూర్వక సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్బంగా మరికొన్ని కమిటీలను స్పీకర్ పోచారం.అయితే అభివృద్ధిని ఓవైసీకి పీఏసీ చైర్మన్ గా పదవి కట్టబెట్టడం తో దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: