దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మరణం వల్ల వచ్చిన సానుభూతి వల్లే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారంటూ కొ(చె)త్తపలుకులో సీనియర్ పాత్రికేయుడు ఓ చెత్త కామెంట్ చేశారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ప్రజల్లో సానుభూతి వచ్చిందట. ఆ సానుభూతి వల్లే తనపై ఎన్ని ఆరోపణలున్నా జగన్ సిఎం అయ్యారట.  వైసిపి అఖండ విజయం సాధించటాన్ని చంద్రబాబునాయుడు లాగే ఆ సీనియర్ పాత్రికేయుడు కూడా తట్టుకోలేకున్నారని అనటానికి ఇదొక తాజా ఉదాహరణ.

 

సానుభూతి వల్లే  జగన్ సిఎం అయ్యాడని చెప్పటంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే జగన్ కు సొంతంగా జనాల్లో ఆధరణ లేదని చెప్పటమే. తండ్రి మరణం వల్ల వచ్చిన సానుభూతితోనే జగన్ అధికారంలోకి వచ్చాడని చెప్పటమే విచిత్రంగా ఉంది. నిజంగానే వైఎస్సార్ సానుభూతి వల్లే జగన్ సిఎం అయ్యుంటే అది 2019లో కాదు 2014లొనే అయ్యుండాలి.

 

2009లో వైఎస్సార్ మరణించారు. 2014లో జరిగిన ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వైసిపికి 67 అసెంబ్లీ, 8 ఎంపి సీట్లు వచ్చాయి. నిజానికి ఓ లీడర్ మరణిస్తే 5 ఏళ్ళ పాటు సానుభూతి ఉండటం కష్టమే. ఒకవేళ నిజంగానే సానుభూతి ఉందని అనుకున్నా ఆ సానుభూతి 67 అసెంబ్లీ సీట్లలో గెలవటానికే పరిమితమైపోయింది. అంటే వైఎస్సార్ మరణం వల్ల వచ్చిన  సానుభూతి  2014కే సరిపోయింది.

 

మరి 2019లో 151 సీట్లలో వైసిపి ఎలా గెలిచింది ? ఎలాగంటే 2014-2019 మధ్య చంద్రబాబునాయుడుపై జనాల్లో పెరిగిపోయిన తీవ్ర వ్యతిరేకతే ప్రధాన కారణం. అదే సమయంలో చంద్రబాబు పాలనపై వైసిపి చేసిన పోరాటాలు కూడా కలిసివచ్చాయి. వీటన్నింటికీ మించి  3681 కిలోమీటర్ల జగన్ పాదయాత్ర అన్నింటికీ మించిది. హోలు మొత్తం మీద తేలిందేమిటంటే వైసిపి 151 సీట్ల అఖండ విజయం వెనుక చంద్రబాబుపై జనాల్లో పెరిగిన పోయిన కసి, వ్యతిరేకతతో పాటు జగన్ పై సానుకూలతే కారణం. చంద్రబాబు మీద వ్యతిరేకత పెరిగిపోయిందని అంగీకరించలేని ఎల్లోమీడియా జగన్ పై సానుకూలత ఉందని ఎలా అంగీకరిస్తుంది ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: