నగర జీవులకు రోజురోజుకు భద్రత కరువవుతుంది.ఇంట్లోనుండి బయటకు వెళ్లితే మళ్లీ ఇల్లు చేరుకుంటామనే నమ్మకం లేకుండా పోతుంది.ఇప్పటికే పడే వర్షాలతో రోడ్లు, ట్రాఫిక్ నరకాన్ని చూపిస్తుంటే,ఎక్కడ నిలబడితే ఏది వచ్చి మీద పడి ప్రాణాలు పోతాయోననే భయం అణు వణువున వెంటాడుతుంది.హోర్డింగ్‌ల వల్ల ఇప్పటికే అక్కడక్కడ ప్రాణాలు పోతున్నాయంటే.కొత్తగా ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన మెట్రో కట్టడాలవల్ల కూడా ప్రాణాలు పోతున్నాయి.చనిపోయేవారి తలరాత అనుకోవాల, అధికారుల నిర్లక్ష్యం అని ప్రశ్నించాలో తెలియక ప్రజలు తమలో తామే కుమిలి పోతున్నారు ఇటువంటి సంఘటనలను చూసినప్పుడు.ఏది ఎమైతేనేని మొత్తానికి అభం శుభం తెలియని అమాయకులు బలిపశువుల్లా మారుతున్నారు.



ఇప్పుడు నగరం నడిబొడ్డున,నిత్యం అత్యంత రద్ది ఉండే ప్రదేశం అయినా అమీర్‌పేట మెట్రో స్టేషన్ దగ్గర ఎవరు ఊహించని,విషాద ఘటన జరిగింది.స్టేషన్ మెట్ల దగ్గర పెచ్చులూడి మీద పడటంతో పాపం ఓ మహిళ చనిపోయింది.అమీర్‌పేటలో భారిగా వర్షం కురుస్తుండటంతో ఆ మహిళ మెట్రో స్టేషన్ మెట్ల దగ్గర నిలబడింది.ఈలోపు రెయిలింగ్ ఒక్కసారి ఊడి ఆమె తలపై పడింది.తీవ్రంగా గాయపడిన ఆమెను హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు..అక్కడ చికిత్సపొందుతూ చనిపోయింది.ఇక మృతురాలిని కేపీహెచ్‌బీకి చెందిన కంతాల మౌనికగా గుర్తించిన పోలీసులు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు.



అనుకోకుండా జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్సార్‌నగర్ పోలీసులు.. విచారణ చేపట్టారు.రెయిలింగ్ ఊడిపడటానికి కారణాలపై మెట్రో అధికారులు కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.నాణ్యతాపరమైన లోపమా..వర్షం కారణంగా రెయిలింగ్ ఏదైనా దెబ్బతిని ఊడిపడిందా అన్న కోణంలో విచారణ ప్రారంభించారు.ఓ ప్రాణం పోయాక మేలుకొంటే పోయిన ప్రాణం వస్తుందా అని ఈ సంఘటనను దగ్గరగా చూసిన వారు ప్రశ్నిస్తున్నారు..ఇంకా ఎన్నాళ్లు ఇలాంటి ఘటనలతో ఎంత మంది ప్రజలు ప్రాణాలు కోల్పోవ వలసివస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: