Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Wed, Oct 23, 2019 | Last Updated 7:53 am IST

Menu &Sections

Search

దానిపై ముఖ్యమంత్రి మౌనం ఎందుకు..!!?

దానిపై ముఖ్యమంత్రి మౌనం ఎందుకు..!!?
దానిపై ముఖ్యమంత్రి మౌనం ఎందుకు..!!?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వైసీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తల కోసం పరీక్ష పేపర్‌ లీక్‌ చేసి పేద బిడ్డల భవిష్యత్తును నాశనం చేయటం దుర్మార్గం. రాష్ట్రంలోని పేదలు.. తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలొస్తే తమ పిల్లల భవిష్యత్‌ బాగుపడతాయని, వారికి వేల రూపాయిలు ఖర్చు పెట్టి కోచింగ్‌ సెంటర్లలో శిక్షణ ఇప్పిస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం గ్రామ, వార్డు  సచివాలయ పరీక్ష పపర్‌ లీక్‌ చేసి వారి ఆశలపై నీళ్లు చల్లింది.  వైసీపీ కార్యకర్తలు ఉంగరాలు కొట్టేయటంలో నిపుణులైతే.. వైసీపీ నేతలు ఉద్యోగాలు అమ్ముకోవటంలో ఘనులు.  ఎన్నికల ప్రచారంలో షర్మిల ఉంగరాన్ని  వైసీపీ కార్యకర్తలు కొట్టేశారు. ఎన్నికల తర్వాత వైసీపీ నేతలు పేపర్‌ లీక్‌ చేసి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు.

పరీక్ష పారదర్శకంగా నిర్వహించామని వైసీపీ నాయకులు చెపుతున్నారు. అదే నిజమైతే ఏళ్ల తరబడి అదే పనిగా పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు అరకొర మార్కులొచ్చాయి, ఏపీపీఎస్సీలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి అయిన అనితమ్మకు పరీక్షకు ప్రిపేరవకుండా ఫస్ట్‌ ర్యాంకు, అలాగే ఏపీపీఎస్సీలో ఉద్యోగం నిర్వర్తిస్తున్న మరో వ్యక్తి కుటుంబంలో ఇద్దరికి ర్యాంకులు ఎలా వచ్చాయో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. పేపర్‌ లీక్‌ చేయటం వల్ల కష్టపడి పరీక్ష రాసిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరిగింది.  ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చి నిరుద్యోగులకు న్యాయం చేయాలి. లేకపోతే నిరుద్యోగుల తరపున  రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టి వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.అయిదుగురు ఉపముఖ్యమంత్రులు కలిసి  చంద్రబాబుకు రాసిన లేఖలోని భాష ఘోరంగా ఉంది.

సంప్రదాయాలను పక్కనపెట్టిన వైసీపీ నేతలు  భాషను కూడా భ్రష్టు పట్టించారు. లేఖలో భాష సంగతి ఎలా ఉన్నా.. వైసీపీ కార్యకర్తలకే  వాలంటీర్ల ఉద్యోగాలిచ్చామని  మరోసారి వారే ఈ లేఖలో  స్వయంగా ఒప్పుకున్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజా సమస్యలపై పాటిస్తున్న మౌన వ్రతం పూర్తయ్యేదెప్పుడని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.  వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో అనేక సమస్యలు.. ఇసుక కొరత, చిరుద్యోగుల సమస్యలు, రాజధాని మార్పు, వరదలు, బోటు ప్రమాదం వంటి దేనిపైన కూడా ఆయన స్పందించలేదు. కనీసం ఈ పేపర్‌ లీకేజీపై అయినా ముఖ్యమంత్రి నోరు తెరచి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలి.  


TDP Leader Bonda Uma Maheswara Rao comments on Jagan and his party
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మలేషియాకు షాకిచ్చిన భారత్..
పాక్ కు షాక్ : ఆ విషయంలో భారత్ కు అమెరికా మద్దతు
పీవోకే పై మళ్ళీ విరుచుకుపడిన భారత్..
రాయల్ వసిష్ఠ ఆపరేషన్ సక్సెస్.. బయటపడుతున్న మృతదేహాలు..
అర్చకుల కళ్ళల్లో ఆనందం నింపిన జగన్.. దండాలయ్యా..
ఢిల్లీలోను ఇదే దూకుడును ప్రదర్శిస్తుందా ?
తెరాస ప్రభుత్వం సంచలన నిర్ణయం.. హైదరాబాద్ రోడ్లు ఇకపై..
ఆర్ఆర్ఆర్ టీమ్ పై ఫ్యాన్స్ ఆగ్రహం.. ఇదే కారణం..
బాబుగార్జు మళ్ళీ మొదలెట్టాడు.. హతవిధీ..
అంతరిక్ష వ్యాపారంలో భారత్ ను అధికమించేందుకు చైనా తంటాలు...
ఎన్నికలు ముగిశాయి.. పాక్ భయపడుతోంది.. కారణం..!!
హుజూర్ నగర్ లో 85% పోలింగ్ ... దేనికి సంకేతం..!!
ఎగ్జిట్ పోల్స్ నిజమౌతాయా?
ఐదేళ్ల షూటింగ్ కోసం.. రాజమౌళి 12 ఏళ్ల క్రితమే మొదలుపెట్టాడు..!!
బీజేపీకి.. కాంగ్రెస్ కు ఇదే తేడా.. అందుకే..!!
హర్యానా.. మహాలో మళ్ళీ కమలమే..!!
24 నుంచి ఏపీలో ఇసుక నిరసన దీక్షలు
యూనివర్శిటీల్లో రాజకీయాలా
అప్పట్లో లగడపాటి... ఇప్పుడు రేవంత్ రెడ్డి.. ఇద్దరు ఇలానే..!!
హర్యానా ఎన్నికల సిత్రం.. ఒకరు సైకిల్ పై మరొకరు ట్రాక్టర్ పై.!!
రూ. 99 కే అరకిలో కేక్.. ఓటు వేసిన వాళ్లకు మాత్రమే..!!
ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు వర్షాలు..
జగన్ మరో కొత్త పధకం - వైఎస్ఆర్ ఎమర్జెన్సీ.
హైటెక్ సిటీలో రాత్రి వేళల్లో ఏం జరుగుతుందో తెలుసా?
మోడీ ఆహ్వానంలో తెలుగు తారలు కూడా ఉన్నారు..
ఇండియన్ మిషన్ పీవోకే స్టార్ట్ చేసిందా?
మరాఠా లో వార్ వన్ సైడేనా..!!?
ఇండియా కూడా స్టార్ట్ చేసింది...
ఆ ముత్యం వయసు 8వేల సంవత్సరాలు..  ధర ఏంటో తెలిస్తే షాక్
సకలజనుల సమరభేరిగా మారుతున్న ఆర్టీసీ సమ్మె ..
మోడీకి పూరి ప్రేమలేఖ.. దేని గురించి అనుకుంటున్నారు..!!
ఎట్టకేలకు షా దొరికాడు.. అందుకే ఢిల్లీకి జగన్..
తెలంగాణాలో జగన్ కు పెరుగుతున్న బలం.. ఇదే కారణం..
హుజూర్ నగర్లో ఆ రెండు పార్టీల మధ్యే పోటీ.. కానీ..!!
అగ్రిగోల్డ్ విషయంలో అలానే జరిగింది
వైకాపా అలా గుర్తించడం లేదట..
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.