ఆంధ్రజ్యోతి పేపర్, ఛానల్ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకం అని అందరికి తెలుసు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి పేపర్, ఛానల్ చంద్రబాబు పేపర్లని అందరికి తెలుసు కాబట్టి. ప్రభుత్వానికి ఎంత వ్యతిరేక పేపర్ అయినా ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే ప్రత్యేకంగా కథనాలు రాస్తే అందరూ మెచ్చుకుంటారు కానీ అనవసరంగా రాస్తే ఎవరైనా మండిపడుతారు. 


సరిగ్గా ఇప్పుడు అలానే అనవసరంగా ప్రత్యేక కధనాలు రాసి రాష్ట్రంలో ప్రజలను తికమక పట్టిస్తుంది అని అంటున్నారు వైసీపీ నాయకులూ. ఈరోజు మీడియాతో మాట్లాడిన అనకాపల్లి ఎమ్యెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ఆంధ్రజ్యోతి పేపర్ ని చంద్రజ్యోతిగా మార్చుకుంటే సరిగ్గా సరిపోతుందని వ్యాఖ్యానించారు. 


ఎమ్యెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ..  దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక లక్ష 27 వేల ఉద్యోగాలు సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కల్పించారని ప్రశంసించారు. వార్డు సచివాలయాల ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి పరీక్ష సమాధానాలకి 'కీ' విడుదల చేసే వరకు ఎక్కడ ఎటువంటి లోటు పాట్లు రాలేదని, ఫలితాలు వచ్చిన తర్వాత చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని వ్యాఖ్యానించారు. 


ఉద్యోగాలు సాధించిన బీసీలు, మహిళలను, చివరకు అధిక మార్కులతో టాపర్‌లుగా నిలిచిన వారిని కూడా కించపరుస్తూ తన పచ్చపత్రిక ఆంధ్రజ్యోతి ద్వారా అనుమానాలను వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయంలో ఎన్నిసార్లు పేపర్లు లీక్ అయ్యాయో గుర్తు చేసుకోవాలని సూచించారు. 


ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, చంద్రబాబులకు తప్ప ఈ పరీక్షల మీద ఎవరికి ఎటువంటి అనుమానాలు రాలేదని, ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి తీసుకునే సంచలన నిర్ణయాలను ఓర్వలేక చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రతి ఆదివారం నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో అసలు ఓపెన్ హార్ట్ ఉందా అని అయన ప్రశ్నించారు. 


ఆంధ్రజ్యోతి పేపర్‌ను చంద్రజ్యోతిగా మార్చుకుంటే సరిగ్గా సరిపోతుందని ఆయన ఎద్దవా చేశారు. సీఎం జగన్‌ అందిస్తున్న పారదర్శక పాలన చూసి ఓర్వలేక పరీక్షలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చంద్రబాబు పైశాచిక ఆనందాన్ని పొందుతు ప్రజలకు చందమామ కథలు చెప్తున్నాడని ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. మరి ఆంద్రజ్యోతిని చంద్రజ్యోతిగా మారుస్తారు ఏమో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: