మోడీ పర్యటనలో భాగంగా ఎన్ఆర్ఐల సదస్సు ఎంతో ప్రాచుర్యాన్ని సంతరించుకుంది.హౌడీ   మోడీ అంటూ ఏర్పాటుచేసిన ఈవెంట్లో 50 వేల మంది ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ సదస్సు ఏర్పాటు పదహారు వందల మందికి పైగా వాలంటీర్లు   పర్యవేక్షిస్తున్నారు. కాగా  హౌడీ  మోడీ సదస్సును  విజయవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. కేంద్ర మంత్రులందరూ హౌడీ మోడీ లోగొను  తమ అధికారిక ట్విట్టర్ ప్రొఫైల్ గా మార్చుకున్నారు. కేవలం కేంద్ర మంత్రులే కాదు మోడీ అభిమానులు కూడా హౌడీ మోడీ లోగోను తన ప్రొఫైల్ గా మార్చుకున్నారు. అయితే హౌడీ మోడీ సభలో  ఒకే వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోడీ... అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగం చేయనున్నారు. అయితే ఆరువందలకు పైగా సంస్థల ఇచ్చిన  విరాళం తోనే ఈ మెగా ఈవెంట్ నిర్వహిస్తున్నామని నిర్వహకులు  తెలిపారు.

 

 

కాగా హౌడీ  మోడీ ఈవెంట్ ప్రత్యక్ష వ్యాఖ్యానం   ఇంగ్లీష్ హిందీ స్పానిష్ ల లో జరుగుతుంది.కాగా హౌడీ  మోడీ అంటే అర్థం హౌ డు యు డూ మోడీ అని అర్ధం . హౌ డు యు డు మోడీ అనే పదం రిథమిక్ గా  హౌడీ మోడీ గా మారి  ఈ ఈవెంట్ కి పేరుగా నిలిచింది . విశాలమైన ఎన్ఆర్జి  స్టేడియంలో హౌడీ మోడీ ఈవెంట్స్ జరుగుతుంది.  అయితే ఓ విదేశీ నేత సదస్సుకు ఇంత భారీ సంఖ్యలో ప్రేక్షకులు రావడం తొలిసారట.

మరింత సమాచారం తెలుసుకోండి: