అప్పటికే మూల్గుతూ,ముక్కుతున్న ఓ నక్క చెట్టుకింద వచ్చి నిలబడిందట.అది పనస చెట్టు దానికి పెరిగిన భారి కాయ బరువు ఆగలేక క్రింద పడిందట.క్రింద పడింది ఎక్కడంటారు నక్కమీద.ఇంకే ముంది దాని మూలుగులూ చుట్టుప్రక్కల కిలోమీటర్ వరకు వినిపించాయట.కాని పాపం దాన్ని ఎవ్వరు పట్టించుకునే వారేలేరట.ఇప్పుడు సామాన్యుడి పరిస్ధితి ఇలాగే వుంది.ఇప్పటికే ఎక్కడ అధిక భారం మోయవలసిన పరిస్దితులు వస్తాయోనని సరిగ్గా నిద్దుర కూడ పోవడం లేదట.ఓ వైపు రాష్ట్రం,మరో వైపు కేద్రం తెగ ఆడేసుకుంటుంటే,ఇప్పుడు పెట్రోల్ తెగ మంట పెడుతుంది.ఈ మంట మధ్యప్రదేశ్‌ను తాకింది.తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు తాకుద్దో అని భయం మొదలైంది..



ఎందుకంటే ఇప్పుడు మధ్య ప్రదేశ్‌లో పెట్రోలు కొనాలంటే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.అక్కడ ప్రభుత్వం అకస్మాత్తుగా వాహనదారులకు షాకిచ్చింది.ఇంధనంపై వ్యాట్‌ను ఒక్కసారిగా 5 శాతం పెంచడంతో పెట్రోలు ధరలు ఏకంగా ఆకాశానికి ఎగశాయి.ఎంతలా అంటే దేశం మొత్తం మీద ఇప్పుడు మధ్యప్రదేశ్‌లోనే పెట్రోలు,డీజిల్ ధరలు అత్యధికంగా రికార్డ్ సృష్టిస్తున్నాయట.ఇక ప్రభుత్వం ఈ వ్యాట్ పెంపుదలపై వివరణ ఇస్తూ..వరదల కారణంగానే పన్నును పెంచాల్సి వచ్చిందని, ఇది తాత్కాలికమేనని ఊరటనిచ్చే ప్రయత్నం చేసిందట.పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు డీజిల్ ధరలు లీటరుకు రూ.2 నుంచి ఏడు రూపాయలు,పెట్రోలు ధరలు రూ.4 నుంచి పది రూపాయలు ఎక్కువగా ఉన్నాయి.



పెట్రోలుపై లీటరుకు ఒక్కసారిగా రూ.10 పెరగడంతో సామాన్యుల నుంచి ఇండస్ట్రియలిస్టుల వరకు అందరూ బెంబేలెత్తి పోతున్నారు.పెట్రోలు ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చి ఇప్పుడిదేం పనంటూ మండిపడుతున్నారు.దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మధ్యప్రదేశ్‌లోనే ఇప్పుడు పెట్రోలు,డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని మధ్యప్రదేశ్ పెట్రోలు పంప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అజయ్ సింగ్ తెలిపారు.కాగా, ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలు,ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇకపోతే జూలైలోనే రెండు రూపాయలు పెంచారని,ఇప్పుడు మరోమారు పెంచడం వల్ల నిత్యావసర ధరలు కొండెక్కడం ఖాయమని ఇలాగైతే ఎలా బ్రతికేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట... 



మరింత సమాచారం తెలుసుకోండి: