ఈయన అత్యుత్సాహమే జగన్మోహన్ రెడ్డి కొంప ముంచేసేట్లుంది చూస్తుంటే. నలుగురు నేతల మధ్య మాట్లాడుకోవాల్సిన మాటలన్నింటినీ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మైకులో మాట్లాడేస్తున్నారు. తాజాగా గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల నియామకాల విషయానికి సంబంధించి ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యలే తలనొప్పులు తెస్తున్నాయి.

 

చంద్రబాబునాయుడు-జగన్+విజయసాయిరెడ్డిల మధ్య ఏ స్ధాయిలో వైరం ఉందో అందరికీ తెలిసిందే. వీళ్ళ మధ్య వైరం రాజకీయం స్ధాయిని దాటేసి వ్యక్తిగతంగా మారిపోయింది ఎప్పుడో.  అందుకనే ప్రతి చిన్న విషయానికి అదరూ రెచ్చిపోతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ అదే పరిస్ధితి కనబడుతోంది.

 

విచిత్రమేమిటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాల విషయంలో జగన్ సైలెంట్ అయిపోతే విజయసాయిరెడ్డి మాత్రం అదే స్పీడులో వెళుతున్నారు. తాజాజా ఓ సమావేశంలో విజయసాయి మాట్లాడుతూ ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ల నియామకాల్లో 90 శాతం వైసిపి కార్యకర్తలకే దక్కిందని  చెప్పారు. గ్రామ సచివాలయాల్లో కూడా చాలా మంది మన పార్టీ వారికి పోస్టులు వచ్చినట్లు చెప్పటంతోనే ఇపుడు రచ్చ మొదలైంది.

 

విజయసాయి ప్రకటనపై చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు రెచ్చిపోతున్నారు. భారీ స్కాంకు పాల్పడిన జగన్ తక్షణమే రాజీనామా చేసేయాలని డిమాండ్లు మొదలుపెట్టారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా ? లేకపోతే రాక్షస పాలనలో ఉన్నామా ? అని కూడా అడిగేశారు. ఎందుకయ్యా అంటే  ప్రభుత్వ ఉద్యోగాలను పప్పు బెల్లాల మాదిరిగా కార్యకర్తలకు పంచడం ఏమిటి ? అంటు మండిపోయారు.

 

ఈ అవినీతిపై పోరాడేందుకు ప్రజాస్వామ్య వాదులంతా కలిసి రావాలట. వెంటనే జగన్ రాజీనామా చేసేయాలని  చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి జన్మభూమి కమిటిల పేరుతో చంద్రబాబు చేసింది కూడా ఇదే. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సర్పుంలను కూడా కాదని మొత్తం అధికారాలన్నింటినీ జన్మభూమి కమిటిల చేతిలో పెట్టేసి అవినీతికి లాకులెత్తిన చంద్రబాబు కూడా ఇపుడు నీతులు మాట్లాడుతుండటమే విచిత్రంగా ఉంది.

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: