జగన్ ప్రజారంజక నిర్ణయాలు తీసుకోవడంతో ఇప్పుడు టీడీపీలో ఉన్న నేతలకు ఆందోళన మొదలైందని చెప్పాలి. కేవలం మూడే మూడు నెలలో జగన్ దూకుడును చూసి టీడీపీలో అంతర్గతంగా చర్చ మొదలైంది. పైకి టీడీపీ నాయకులూ విమర్శలు చేస్తున్నప్పటికీ ఆఫ్ ది రికార్డు మాత్రం జగన్ పాలన పట్ల టీడీపీ నేతలు భయపడుతున్న పరిస్థితి. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి రాజకీయ భవిష్యత్ లేకుండా చేస్తాయని చెప్పుకోవటం ఇప్పుడు విశేషం. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేతలు అందరూ ఓడిపోయి ఇళ్లకు పరిమితం అయిన పరిస్థితి. దీనితో టీడీపీలో గెలిచినా ఆ కొంత మంది కూడా తమ భవిష్యత్ పట్ల బెంగగా ఉన్నారని టాక్.


అయితే ఇప్పటికే జగన్ సర్కార్ ఎన్నో నిర్ణయాలను తీసుకుంది. ఉదాహరణకు .. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి క్యాబినెట్ ముద్ర కూడా వేసింది. దీనితో ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎక్కడ లేని ఆనందం వ్యక్తం అవుతుంది. గత దశాబ్దాలుగా ఏ సీఎం తీసుకోని నిర్ణయం జగన్ తీసుకోవటంతో అందరూ జై జగన్ అంటూ మీడియ ముందు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.  ఇదొక్క నిర్ణయం చాలు .. ప్రజల సమస్యల పట్ల జగన్ ఎంత చిత్త శుద్దితో పనిచేస్తున్నారని !


తన తండ్రి రాజన్న పాలనను గుర్తుకు తెస్తున్నారని .. రాజశేఖర్ రెడ్డి అడుగు జాడల్లో పరిపాలనను నడిపిస్తున్నారని . ఎవరు ఏది అడిగిన బోళా శంకరుడు మాదిరిగా హామీలు నెరవేర్చడం ఇవన్నీ జగన్ ప్రతిష్టను పది రెట్లు చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి. దీనితో టీడీపీ ఎక్కడ లేని ఆందోళనకు గురౌతుంది. టీడీపీ తీసుకులోని నిర్ణయం కేవలం మూడు నెలల్లో జగన్ తీసుకొని ఇటు ప్రజల మనసును గెలుచుకున్నారు .. అటు టీడీపీని కుదేలు చేశాడు . అయితే జగన్  సీఎంగా ప్రమాణం స్వీకారం చేసిన రెండు నెలలు కాకముందే మొదటి అసీంబ్లీలో ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ తన పరిపాలన ఎలా ఉండబోతుందో మొదటి రెండు నెలల్లో అర్ధం అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలకు చూపించారు. ఇక టీడీపీ పార్టీ కోలుకోవటం కష్టమేనని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: