బంగారంపై ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది.  బంగారం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగించే వాళ్లలో ఇండియా ముందు వరసలో ఉంటుంది.  అయితే, ఈ బంగారం గురించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  అసలు బంగారం అన్నది ఒరిజినల్ గా భూమిలో దొరికింది కాదు.  దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం భూమిని కొన్నిరకాల గ్రహశకలాలు ఢీకోట్టినపుడు దాని నుంచి బంగారం ఏర్పడింది.  ఇప్పుడు మనం వినియోగిస్తున్న బంగారం అప్పటి ఉల్కల నుంచి వచ్చినదే.  


అయితే, ప్రపంచంలోని బంగారం ఉత్పత్తిలో 11 శాతం ఇండియాలోనే వినియోగిస్తున్నారు.  అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీలో ఉన్న బంగారం నిల్వలకంటే ఇది చాలా ఎక్కువ.  బంగారం ధరలు పెరిగిపోవడానికి కారణం.. భూమిలో బంగారం నిల్వలు తగ్గిపోవడమే అంటున్నారు నిపుణులు.  బంగారం నిల్వలు దారుణంగా తగ్గిపోయాయి.  చాలామంది అవసరం ఉన్నా లేకున్నా బంగారాన్ని కొనుగోలు చేయడం.. దానిని దాచుకోవడం చేస్తున్నారు. 


దీనివలన బంగారానికి డిమాండ్ పెరిగింది. డిమాండ్ కు తగినట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో రేట్లు పెరిగిపోయాయి.  ఫలితంగా ఇబ్బందులు పడుతున్నారు.  ఇదిలా ఉంటె, ఇప్పుడు మరో న్యూస్ అందరిని ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నది.  అది నిజమే అయితే.. ప్రపంచదేశాలు తప్పకుండా దానిపై దృష్టి పెడతాయి.  అదేమంటే.. భూమికి దగ్గరలోనే ఎరోస్ అనే ఒక గ్రహశకలం తిరుగుతున్నది.  ఈ గ్రహశకలంలో దాదాపు 20 బిలియన్ టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు.  


ఒక్క బంగారం మాత్రమే కాకుండా, రాకెట్ల ప్రయోగంలో వినియోగించే అల్యూమినియం, అత్యంత విలువైన ప్లాటినం వంటి ఖనిజాలు కూడా అదే విధంగా ఉన్నాయని తెలుస్తోంది.   బంగాళాదుంప ఆకృతిలో ఉన్న ఈ ఎరోస్ గ్రహశకలాన్ని ఎలా భూవాతావరణంలోకి తీసుకొస్తారు.. దానిని నుంచి ఎలా ఈ బంగారాన్ని వెలికి తీస్తారు అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.  ఒకవేళ ఆ గ్రహశకలం నుంచి బంగారం వెలికి తీయగలితే ... బంగారం ధరలు దాదాపుగా దిగివస్తాయి.  కావాల్సినంత బంగారం చేతికి దొరుకుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: