తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి భేటీ కానున్నారు . అయితే రాష్ట్ర విభజన లో కొన్ని అంశాలు  ఇప్పుడి  వరకు పరిష్కారం కానందున వాటిపై చర్చించేందుకే జగన్ కెసిఆర్ తో  భేటీ అవ్వనున్నారు. 9, 10 షెడ్యూల్లోని ఆస్తులు,  అప్పుల పంపకాలు, ఉద్యోగుల విభజన తదితర అంశాలపై ఇద్దరు తెలుగు రాష్ట్రాల సీఎంలు చర్చిస్తారని సమాచారం. ప్రధానంగా గోదావరి కృష్ణ నదుల అనుసంధానం ...  శ్రీశైలానికి గోదావరి జలాలను తరలించి అంశంపై  చర్చించనున్నారు. 

 

 

 

 అంతేకాకుండా వరద నీరు సముద్రంలోకి పంపకుండా కరువు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మేలు జరిగేలా ఉపయోగించే విధంగా చేసి వాళ్ల నీటి కష్టాలు తీర్చే అంశంపై ద కూడా జగన్ కేసిఆర్ చర్చించనున్నారు. కాగా కేసిఆర్ తో భేటీ నిమిత్తం   తాడేపల్లి లోని జగన్  నివాసం నుండి బయల్దేరి  9.50 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జగన్... అక్కడి నుండి 10.40కి హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం హైదరాబాద్ లోని జగన్ ఇళ్ళు లోటస్పాండ్ కి వెళ్తారు జగన్. మధ్యాహ్నం ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ అవ్వనున్నారు జగన్. అయితే ప్రస్తుతం చర్చించాల్సిన అంశాలపై ఉన్నతాధికారుల స్థాయిలో ఇప్పటికే చర్చలు జరగ్గా... ఇరు రాష్ట్రాల సీఎం లు వాటిని ఫైనల్ చేయనున్నారు. కాగా ఈ భేటీలో  ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాదికారులు కూడా పాల్గొననున్నారు. కాగా జగన్ ప్రభుత్వం  ఏర్పడినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మెరుగవుతున్న  విషయం తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి: