టెక్సాస్ లోని హ్యూస్టన్ లో హౌడీ మోడీ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ కార్యక్రమం ఈ స్థాయిలో విజయవంతంగా జరగడానికి ప్రధాన కారణం హ్యూస్టన్ ఫోరమ్ సభ్యులే అని చెప్పాలి.  హ్యూస్టన్ ఫోరమ్ స్వచ్చంద సేవ సంస్థ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  ఈ కార్యక్రమానికి దాదాపు 20 దేశాల నుంచి అమెరికాలోని 48 రాష్ట్రాల నుంచి భారతీయ అమెరికన్లు హాజరయ్యారు.  వీరితో పాటుగా  వివిధ రాష్ట్రాలకు చెందిన సెనేటర్లు, గవర్నర్లు కూడా హాజరయ్యారు.  


ప్రధానితో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం.  ఈ సభలో మోడీ అమెరికా ప్రెసిడెంట్ గురించి అద్భుతంగా మాట్లాడారు.  ట్రంప్ ఎకానమీ స్ట్రాటజీ గురించి మాట్లాడారు. ట్రంప్ వచ్చిన తరువాత అమెరికా ఎకానమీ ఎలా మారిందో చెప్పుకొచ్చారు.  ఏక్ బార్ ట్రంప్ సర్కార్ అని మాట్లాడారు.  మరోసారి ట్రంప్ సర్కార్ రావాలని కోరుకున్నారు. సో, ఈ సభకు ట్రంప్ హాజరు కావడం వెనుక ఎన్నిక వ్యూహం ఉన్నట్టుగా తెలుస్తోంది.  


వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి.  ఆ అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరోసారి పోటీ చేస్తారు.  అక్కడ అధ్యక్ష పదవికి రెండు సార్లు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంటుంది.  కాబట్టి నెక్స్ట్ టైమ్ కూడా ట్రంప్ ను ఎన్నుకోవాలని భారతీయ అమెరికన్లకు మోడీ సూచించినట్టు అయ్యింది.  ట్రంప్ స్వతహాగా వ్యాపారవేత్త.  అమెరికాలో వ్యాపారవేత్తలకు ట్రంప్ ఎప్పుడు స్వగతం పలుకుతూనే ఉన్నాడు.  అంతేకాదు.. గత అధ్యక్షులులాగా యుద్దానికి కాలుదువ్వడం లేదు.. 


కారణం ఇప్పటికే అమెరికా ఆర్ధిక వ్యవస్థ బలహీన పడింది.  యుద్ధం కంటే ఆర్ధిక వ్యవస్థను బలం చేసుకోవడం ముఖ్యం.  ప్రపంచ పెద్దన్న అనే ట్యాగ్ ను పక్కన పెట్టకూడదు కాబట్టి, ఆర్ధికంగా బలపడాలి కాబట్టి వ్యాపారాన్ని పెంచిపోషించాలని అనుకుంటున్నాడు.  అందుకే ఆర్ధికంగా కలిసి వచ్చే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు ట్రంప్.  ఇండియా కూడా బలంగా ఎదుగుతున్నది కాబట్టి.. హౌడీ మోడీ సభకు ట్రంప్ హాజరయ్యారు.  ట్రంప్ ఎన్నికల స్టంట్ తో పాటు ఇటు అమెరికన్ భారతీయులను కూడా కలిసినట్టయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: