జగన్ సీఎం అయ్యాక చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో వెనకబడిన ప్రాంతాల విషయంలో అభివ్రుధ్ధి చేసేందుకు ఆయన ద్రుష్టి పెట్టారు. తాను సీమ నుంచి వచ్చానన్న ఆలోచనలతో జగన్ ఆ ప్రాంతం రుణం తీర్చుకునేందుకు కూడా కొన్ని నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా తీసుకుంటున్నారు. అందులో ఓ అపూర్వ ఘట్టానికి అంకురార్పణ జరగబోతోంది.


ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణం చేశాక పొరుగు రాష్ట్రం తెలంగాణాతో బంధాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా ఇద్దరు సీఎంల మధ్య మంచి స్నేహం వెల్లివిరుస్తోంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేవిధంగా గోదావరి జలాల ఎత్తిపోతల పధకానికి శ్రీకారం చుట్టాలనుకుంటున్నారు. ప్రగతి భవన్లో ఈ రోజు దీనికి సంబంధించి మరో అడుగు పడనుంది. గతంలో ఓసారి ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమైనపుడు ఈ ఆంశాన్ని ప్రాధమికంగా చర్చించారు. ఇపుడు దానికి కొనసాగింపుగా మరింత లోతైన చర్చకు అవకాశం ఉంది.



పైగా రెండు రాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు ఇచ్చిన నివేదికలను దగ్గర పెట్టుకుని మరీ ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. గోదావరి జలాలను క్రిష్ణకు అనుసంధానం చేయడం ద్వారా రాయలసీమ ప్రాంతాలకు మొత్తంగా నీళ్ళివ్వాలన్నది జగన్ సంకల్పం. అదే విధంగా శ్రీశైలం, నాగార్జున ప్రాజెక్టులు మొత్తం నింపాలన్నది కూడా ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం. మరి ఈ దిశగా కార్యాచరణకు ఈ సమావేశంలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారని అంతా భావిస్తున్నారు. అదే విధంగా ఇది భారీ ఎత్తిపోతల ప్రాజెక్ట్. లక్షల కోట్లు వ్యయం అయ్యే అవకాశం ఉంది. మరి నిధుల విషయం కూడా సీఎం మధ్యన చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో విభజన హామీల గురించి కూడా రెండు  రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: