ఈ మధ్య కాలంలో ఫాస్ట్ పుడ్ సెంటర్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఫాస్ట్ పుడ్ సెంటర్లు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, యువత, ఉద్యోగులు ఎక్కువగా ఫాస్ట్ పుడ్ కు అలవాటు పడుతున్నారు. గతంలో పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఫాస్ట్ పుడ్ సెంటర్లు ఇప్పుడు పల్లెల్లో కూడా పెరుగుతున్నాయి. కానీ ఈ ఫాస్ట్ పుడ్ పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. 
 
పలు పరిశోధనల ప్రకారం ఫాస్ట్ పుడ్ తినటం ద్వారా కేన్సర్, గుండె జబ్బులు, స్థూలకాయం, రక్తపోటు, మధుమేహం వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఒక సర్వే ప్రకారం ఫాస్ట్ పుడ్ ఎక్కువగా తీసుకొనేవారు డిప్రెషన్ వ్యాధికి గురయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫాస్ట్ పుడ్ తినే పిల్లలు త్వరగా డిప్రెషన్ కు లోనయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలలో తెలిసింది. 
 
ఫాస్ట్ పుడ్ ఎక్కువగా తినే 84 మంది పిల్లల మూత్ర నమూనాలను సేకరించి 18 నెలలు పరిశోధనలు చేసిన తరువాత శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. ఈ పరిశోధనలలో జంక్ పుడ్ తీసుకునే వారిలో పొటాషియం తగ్గి సోడియం పెరుగుతుందని తెలిసింది. జంక్ పుడ్ లో ఎక్కువగా ఉప్పు, చక్కెర, కొవ్వుకు సంబంధించినవి ఉంటాయి. శరీరానికి ఉపయోగపడే పోషక పదార్థాలు, ప్రోటీన్స్, విటమిన్స్ ఇందులో ఉండవు. 
 
పొటాషియం శాతం పెరగాలంటే ఎక్కువగా పెరుగు, కూరగాయలు, నారింజ, అరటిపండ్లు, టమోటాలు, బచ్చలి కూర  తీసుకోవాలి. జాతీయ డేటా విశ్లేషణలో 12 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల మధ్య వయస్సు పిల్లలు ఎక్కువగా డిప్రెషన్ కు లోనవుతారని తెలిసింది. సంవత్సరం సంవత్సరానికి ఈ శాతం పెరుగుతూనే ఉంది. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవటం, వ్యాయామం చేయటం , 6 నుండి 8 గంటలు నిద్రపోవటం వలన డిప్రెషన్ దూరం అయ్యే అవకాశం ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: