గ‌త కొన్ని రోజులుగా సామాన్య ప్ర‌జ‌ల న‌డ్డి విరుస్తున్నాయి పెట్రోల్ ధ‌ర‌లు. ఎన్నిక‌ల ముందు భారీగా పెరుగుతూ వ‌చ్చిన పెట్ర‌ల్, డీజిల్ ధ‌ర‌ర‌లు, ఎన్నిక‌ల స‌మ‌యంలో కాస్త నిల‌క‌డ‌గా ఉండిపోయాయి. ఎన్నిక‌లు ముగిస‌న త‌ర్వాత మ‌ళ్లీ పెరుగులు పెట్టాయి. ఇప్ప‌టికే వారం, ప‌ది రోజుల నుంచి పెరుగుతూ వ‌చ్చిన పెట్రోల్ ధ‌ర‌లు మ‌ళ్లీ పై చూపులు చూస్తూ వాహ‌న‌దార‌ల‌కు షాకిచ్చే దిశ‌గా ప‌రుగులు పెడుతోంది.  పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ర‌ల‌తో సామాన్యులు బెంబేలేత్తిపోతున్నారు. అయితే ఈ ధ‌ర‌లు ఒక్కోరాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటున్నాయి. కానీ ఈ భ‌గ్గుమంటున్న పెట్రోల్ మ‌న రాష్ట్రంలో కాదండోయ్‌....అలా అనుకుంటే ప‌ప్పులో  కాలేసిన‌ట్లే. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్ ధ‌ర‌ర‌ల‌ను చూసి వాహ‌న‌దారులు హ‌డ‌లెత్తిపోతున్నారు. వాహ‌నాలు బ‌య‌ట‌కు తీయాలంటేనే జంకుతున్నారు. 
అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇంధనంపై పెంచిన సుంకాలతో ధరలకు అకాశానికి ప‌రుగులు పెడుతున్నాయి. ఒక్కసారిగా 5 శాతం వ్యాట్‌ను పెంచడంతో.. పెట్రోలు ధరలు రెచ్చ‌లొచ్చాయి. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం పెరిగిన పెట్రోల్ ధరలు.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ భారీ స్థాయిలో ధ‌ర‌లు పెర‌గ‌డంతో వాహ‌న‌దారులు షాక్‌కు గుర‌వుతున్నారు.వ్యాట్ కార‌ణంగా పెట్రోల్ ధర లీటర్‌కు ఏకంగా రూ.10ల‌కు ఎగ‌బాకింది.


అయితే ఇత‌ర రాష్ట్రాల‌తో పోలిస్తే మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం డీజిల్ ధర లీటరుకు రూ. 2 నుంచి 7 రూపాయ‌లు అధిక‌గా ఉండగా.. పెట్రోలు ధర రూ.4 నుంచి 10 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి. స‌డ‌న్ గా ఇలా ధ‌ర‌లు పెర‌గ‌డంతో సామాన్య  ప్ర‌జ‌ల నుంచి భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.  పెట్రోల్‌ ధరలు తగ్గిస్తామని అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు ఇలా చేస్తున్నారంటూ కమల్ నాథ్ స‌ర్కార్ పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నారు. అయితే వ్యాట్ పెంపుదలపై స‌ర్కార్ మాత్రం వివ‌ర‌ణ ఇచ్చుకుంది. వరదల కారణంగానే ట్యాక్స్ పెంచాల్సి వ‌చ్చింద‌ని చెబుతోంది. కానీ ఇది  తాత్కాలికమేనని త్వ‌ర‌లో ధ‌ర‌లు త‌గ్గించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెబుతోంది స‌ర్కార్‌. మొత్తం మీద ధ‌ర‌లు త‌గ్గించుడు ఏమో  కానీ...ఇప్పుడు సామాన్య‌ల‌కు త‌ల‌పై భారంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: