అక్టోబర్ నెలలో ఇండియాకు వివివిఐపిల తాకిడి ఎక్కువగా ఉండబోతున్నది.  గాంధీ జయంతి సందర్భంగా ఇండియాలో అనేక నూతన కార్యక్రమాలు మొదలు కాబోతున్నాయి.  ఈ కార్యక్రమాల ద్వారా స్వచ్ఛ భారత్ ను నిర్మించాలని ఇండియా చూస్తున్నది.  సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించడానికి ఇండియా సిద్ధం అయ్యింది.  దానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను ఇండియా ప్రారంభించబోతున్నది.  


ఇక ఇండియాకు ఎన్.బి.ఏ పోటీలను పరిచయం చేయబోతున్నారు.  ఇండియాలో బాస్కెట్ బాల్ పోటీలకు పెద్దగా ప్రధాన్యత ఉండదు.  అదే అమెరికాలో ఈ క్రీడలకు మంచి పేరు ఉన్నది.  అక్టోబర్ 4,5 వ తేదీల్లో ఇండియాలో ఈ గేమ్స్ జరగబోతున్నాయి.  శాక్రమాంటో కింగ్స్  వర్సెస్ ఇండియా పెసర్స్ మధ్య ఈ గేమ్స్ జరగబోతున్నాయి.  ఈ క్రీడలను వీక్షించేందుకు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ రాబోతున్నారు.  


ఇండియాకు ఆ క్రీడలను చూసేందుకు రావొచ్చా అని అడిగాడు.  తప్పకుండా వస్తానని చెప్పాడు.  సో, ట్రంప్ వచ్చేనెల 4 వ తేదీన ఇండియాకు వచ్చే అవకాశం ఉన్నది.  ట్రంప్ ఇండియాకు వస్తున్నాడు అంటే ఇక్కడ హడావుడి మాములుగా ఉండదు.  అందులో ముంబై నగరంలో కాబట్టి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉంటాయి.  ఇక్కడ అదే నెలలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా ఇండియాకు వస్తున్నారు.  


ఈసారి ఈ ఇద్దరు ఢిల్లీలో కాకుండా తమిళనాడులోని ఓ ప్రముఖ క్షేత్రంలో భేటీ అయ్యే అవకాశం ఉన్నది.  ఇప్పటికే భద్రతాధికారులు ఆ క్షేత్రాన్ని పరిశీలించినట్టు తెలుస్తోంది.  జిన్ పింగ్,  మోడీల మధ్య ట్రేడింగ్ కు సంబంధించిన అంశాలతో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి.  ట్రెడ్ తో పాటు జమ్మూ కాశ్మీర్, పీవోకే అంశం కూడా చర్చకు రావొచ్చు.  సో, అక్టోబర్ మాసం వివివిఐపిల రాకతో ఇండియా వేడెక్కబోతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: