దేశంలో దొంగలు పడ్డారు.. ఇది ఒకప్పుడు వచ్చిన సినిమా టైటిల్.  ఆ సినిమాలో అవినీతి రాజకీయం గురించి చూపించారు.  ఇప్పుడు రాజకీయాల్లో అవినీతి జరుగుతూనే ఉన్నది.  ఇక దేశంలో బతకాలి అంటే డబ్బు కావాలి.  చిన్న చితకా పనులు చేస్తే కావాల్సినంత డబ్బు రాదు.  జల్సాలు చేయడం కుదరదు.  అందుకే చాలామంది పెడత్రోవన డబ్బు సంపాదించేందుకు సిద్ధం అయ్యి దొంగతనాలకు పాల్పడుతున్నారు.  


ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసినా.. ఏ నగరంలో చూసిన దొంగలు.. దొంగతనాలు ఎక్కువయ్యాయి.  దొంగతనం చేసి పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నా.. ఇంకా అలాంటి దొంగతనాలకు పాల్పడుతూనే ఉన్నారు.  తాజాగా ఢిల్లీలోని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్  ఇంట్లో దొంగలు పడ్డారు.  గత ఆరు నెలలుగా అయన ఉంటున్న ఇంటికి తాళం వేసి ఉన్నది.  కొంతకాలంగా వారు వేరే ఇంట్లో ఉంటున్నారు.  


అదే అదునుగా భావించిన దొంగలు ఆ ఇంట్లోకి దూరి కొన్ని విలువైన వస్తువులు తీసుకెళ్లారట.  ఈ విషయం తెలుసుకున్న మంత్రిగారి భార్య హుటాహుటిన అక్కడికి వెళ్లి పరిశీలించింది.  పోలీసులకు కంప్లైంట్ చేసింది.  పోలీసులు షరా మాములుగా వచ్చి కేసు నమోదు చేసుకున్నారు.  త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్తున్నారు.  ఎప్పుడు పెట్టుకుంటుంటారు అన్నది తెలియాలి.  


గత కొంతకాలంగా ఢిల్లీలో దొంగతనాలు బాగా పెరిగిపోయి.  నగరం మొత్తం సిసి కెమెరాల నీడలో ఉన్నా.. ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  దీనికి కారణం ఏంటి ఎవరు ఇలా చేస్తున్నారు అన్నది తెలియడం లేదు.  మంత్రిగారి ఇంట్లోనే దొంగలు పడ్డారు అంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి.. వారికి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది.  దొంగతనం చేయడానికి వచ్చిన వ్యక్తులు ఏది దొరికితే దానితో కొట్టేసి డబ్బులు లాక్కొని వెళ్లిపోతుంటారు.  ఇదే భయం ఇప్పుడు అందరిని వెంటాడుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: