జగన్ అంటే స్వయంగా ఎదిగిన నాయకుడుగా ఇపుడు  అంతా చూస్తున్నారు. అయితే అయన మహా నేత వైఎస్సార్ కుమారుడిగా ఇప్పటికీ జనంలో అభిమానం, ఆదరణ  అలాగే ఉన్నాయి. జగన్ పదేళ్ల పోరాటం తరువాత తాను కోరుకున్న సీఎం సీటుని అందుకున్నారు. అయితే జగన్ సొంతంగా పెంచుకున్న చరిష్మా ఎంత ఉందో వెనక వైఎస్సార్ తరగని ఇమేజ్ కూడా అంతే ఉందని చెప్పాలి.


ఇదిలా ఉండగా జగన్ కి తండ్రి నుంచి మంచితో పాటు కొంత ఇబ్బంది కలిగించే విషయాలు కూడా వారసత్వంగా వచ్చాయి. అందులో మీడియాతో శత్రుత్వం. ముఖ్యంగా నిండు సభలో ఆ రెండు పత్రికలు అంటూ వైఎస్సార్ ముఖ్యమంత్రి హోదాలో చెడుగుడు ఆడిన విషయాలు ఎవరూ మరచిపోలేరు. ఇక వైఎస్సార్ ఆకస్మిక మరణం తరువాత జగన్ ఆయన రాజకీయ వారసుడిగా రావడంతో ఆ రెండు పత్రికలు జగన్ కి కూడా శత్రువుగా  మారిపోయాయి.


ఇపుడు ఏపీలో జగన్ సీఎం గా ఉండడంతో ఆ పత్రికలు తమదైన రాజకీయ వార్తలను వండి వారుస్తున్నాయి. ఈ విషయంలో జగన్ చేయగలిగింది ఏదీ లేదని కూడా అంటున్నారు. ఆ రెండు పత్రికల్లో ఓ పత్రిక మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేక విధానం అవలంబిస్తోంది. అందువల్ల వైఎస్సార్ కి శత్రువు అయింది. తరువాత ఆ పత్రికాధిపతి ఇతర వ్యాపార లావాదేవీల్లో కూడా ఇబ్బందులు కలిగించే చర్యలు అప్పట్లో  కొన్ని జరగడంతో పూర్తిగా యాంటీ వైఎస్ కుటుంబం  విధానాన్ని అనుసరిస్తోంది.


మరో పత్రిక విషయానికి వస్తే దాని యజమానికి జగన్ తో డైరెక్ట్ గా ఏమీ శత్రుత్వం లేదు. అలాగని వైఎస్సార్ కూడా చేసిన నష్టం అంతకంటే లేదు. కానీ సొంత సామాజికవర్గం పైన ఉన్న మమకారంతో పాటు, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా లభించిన ఆర్ధిక వెసులుబాటు వంటి వాటిని ద్రుష్టిలో ఉంచుకుంటే సహజంగా టీడీపీ అధికారంలోకి రావాలని ఆ పత్రికకు ఉంటుంది. అందువల్లనే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన మొదటి రోజు నుంచే వ్యతిరేక వార్తలు రాస్తూ పూనకం తెప్పిస్తోంది.


మరి జగన్ కి పాజిటివ్ గా వైఎస్సార్ నుంచి వచ్చిన వారసత్వం అందలం ఎక్కించింది. ఈ వారసత్వం వల్ల శత్రువులు ఉన్నా కూడా డేరింగ్ గా ఎదుర్కోవడం తప్ప ఏం చేయలేని పరిస్థితి అని ఆ పార్టీ నాయకులు విశ్లెషిస్తున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో మరింత అలెర్ట్ గా జగన్ సర్కార్ ఉండాలని వారు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: