కరకట్ట మీద నివాసముంటున్న అక్రమ నిర్మాణాన్ని ఖాళీ చేయటానికి చంద్రబాబునాయుడుకు మిగిలింది మూడు రోజులే డెడ్ లైన్. కరకట్ట మీద లింగమనేని రమేష్ అక్రమంగా నిర్మించిన గెస్ట హౌస్ లో చంద్రబాబు నివాసముంటున్న విషయం అందరకీ తెలిసిందే. ఈ గెస్ట్ హౌస్ కేంద్రంగా చంద్రబాబు, చినబాబు + టిడిపి నేతలు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.

 

ఈ నేపధ్యంలోనే  గెస్ట్ హౌస్ ను కూల్చేయబోతున్నట్లు సిఆర్డీఏ ఉన్నతాధికారులు లింగమనేనికి వారం రోజుల గడువు ఇచ్చారు. ఈ వారంలో తన గెస్ట్ హౌస్ లో అక్రమ నిర్మాణాలుగా సిఆర్డీఏ నిర్ధారించిన గదులను కూల్చేయాలని కూడా చెప్పారు. ఒకవేళ లింగమనేని గనుక కూల్చకపోతే ఆ పనిని తామే చేస్తామని కూడా సిఆర్డీఏ ఉన్నతాధికారులు స్పష్టంగా నోటిసులో చెప్పారు.

 

గతంలో కూడా ఓసారి లింగమనేనికి నోటిసిచ్చినప్పటికీ ఆయనిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదు. పైగా తనకు నోటీసులిచ్చిన అధికారి స్ధాయినే లింగమనేని ప్రశ్నించటంతో ప్రభుత్వానికి మండిపోయింది. దాంతో ఎలాగైనా గెస్ట్ హౌస్ ను కూల్చేయాలని ప్రభుత్వం గట్టిగా డిసైడ్ అయ్యింది. కాకపోతే ఇందులో చంద్రబాబు నివాసం ఉండటమే ఇబ్బందిగా మారింది.

 

సరే లింగమనేనితో పాటు నోటిసులందుకున్న ఇతర నిర్మాణాలపై చర్యలకు సిఆర్డీఏ రంగంలోకి దిగింది. 5 ఎకరాల స్ధలంలో కరకట్టకు దిగువ భాగంలో పాతూరి కోటేశ్వరరావు గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారు. ఆందులో నదిని ఆక్రమించి నిర్మించిన భాగాన్ని అధికారులు కొట్టేస్తున్నారు. దాంతో చంద్రబాబు ఇంటిని కొట్టేస్తున్నట్లు ఎల్లోమీడియా ఒకటే గోల మొదలుపెట్టేస్తోంది.

 

చంద్రబాబు నివాసం ఉంటున్న గెస్ట్ హౌస్ ను కూలగొట్టటానికి ఇంకా మూడు రోజులే డెడ్ లైన్ మిగులుంది.  ఎందుకంటే లింగమనేనికి నోటీసులిచ్చి ఈరోజుకు నాలుగు రోజులైంది. ఇంత వరకూ బహిరంగంగా లింగమనేని అయితే స్పందించలేదు. ఎలాగూ అక్రమ నిర్మాణాలని నిర్ధారించారు కాబట్టి ఆ భాగాన్ని కూల్చేయటం ఖాయమే అని తేలిపోయింది. మరి మూడు రోజుల్లో చంద్రబాబు ఏం చేస్తారో చూడాలి.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: