తనను ఇబ్బంది పెట్టిన కాంగ్రెస్ ను ఓ చూపు చూడాలని జగన్మోహన్ రెడ్డి గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే తన ప్రమేయం లేకుండానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తనకు తానే ఘోరీ కట్టేసుకుంది. కాబట్టి తెలంగాణాలో దాని కతేంటో చూడాలని డిసైడ్ అయ్యారట. అందుకనే హుజూర్ నగర్ లో పోటి పెట్టే విషయాన్ని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ అసెంబ్లీకి  ఉప ఎన్నిక జరగబోతోంది. మొన్నటి వరకూ ఎంఎల్ఏగా ఉన్న తెలంగాణా పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపిగా ఎన్నికయ్యారు. దాంతో హుజూర్ నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అవసరం అయ్యింది. ఈ స్ధానంలో ఎవరిని పోటికి దింపాలనే విషయంలో మామూలుగానే వర్గాలు కొట్టేసుకుంటున్నాయి.

 

తన భార్య పద్మావతికే టికెట్ ఇవ్వాలని ఉత్తమ్ పట్టుబడుతున్నారు. కిరణ్ కుమార్ కు టికెట్ ఇవ్వాలని వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అధిష్టానంపై ఒత్తిడి పెడుతున్నారు. సరే సీనియర్లలో రెండు వర్గాలుగా చీలిపోయారు. కొందరేమో ఉత్తమ్ కు మద్దతుగా నిలిస్తే మరికొందరేమో రేవంత్ ను సపోర్టు చేస్తున్నారు.

 

సరే వీళ్ళ గోల తెగేటప్పటికి టైం పడుతుంది. ఈలోగా టిఆర్ఎస్, బిజెపిలు కూడా తమ అభ్యర్ధులను రెడీ చేసుకుంటున్నాయి. ఇలా ఎవరి గోలలో వారుంటే మధ్యలో వైసిసి కూడా పోటికి రెడీ అవుతోందని సమాచారం. పోటి చేసినా వైసిపి గెలుస్తుందనే నమ్మకం లేదు. కానీ ఎన్నో కొన్ని ఓట్లయితే వేయించుకోగలుతుంది. అదే కావాలట జగన్ కు.

 

ఎందుకంటే కాంగ్రెస్ ఓటమే ధ్యేయంగా జగన్ పావులు కదుపుతున్నారు. జగన్ పోటి వల్ల ఎవరికి లాభం ? ఎవరు గెలుస్తారు ? అన్నది ఇంపార్టెంట్ కాదు జగన్ కు. తాము చీల్చుకోబోయే ఓట్లతో కాంగ్రెస్ ను ఓడించటమే టార్గెట్ గా జగన్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. మరి జగన్ టార్గెట్ రీచవుతారా ? లేదా ? అన్నది వేచి చూడాల్సిందే

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: