తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతిపక్షాలకు గుబులు పుట్టిస్తున్నాయట.అటు బీజేపీని,ఇటూ కాంగ్రెస్ ను చెడుగుడు ఆడేసుకుంటూ,వీరిపై వదులుతున్న మాటల తూటాలే అందుకు కారణమట.విషయమేంటంటే తెలంగాణ అసెంబ్లీలో సీఎం.కేసీఆర్,బీజేపీని తీసిపారేశారు.కాంగ్రెస్ ను ఆడేశారు అమాస-పున్నానికి వచ్చి లొల్లి చేసే బీజేపీ ఆటలు తెలంగాణలో ఇక సాగవన్నారు.కాంగ్రెస్ అసలు తమకు పోటీకాదంటూ ఎద్దేవా చేసారు.ఇక భవిష్యత్ లో కూడా మా పార్టీనే అధికారంలో వస్తుందని ధీమాగా చెప్పారు.ఇంతకు ఆయన ఇంతలా చెబుతున్నాడంటే దాని వెనుకున్న అసలు కారణం ఏంటని ఆలోచిస్తున్నారా!



అవి పథకాలట కాదు అద్భుత పథకాలట.ఇవే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోనికి రావడానికి సోపానాలని భావిస్తున్నారట. అందుకే రెండు స్కీములు పెడితే మీపని ఖతమేనని కాంగ్రెస్ నేతలను హెచ్చరిస్తున్నారట.ఇంతకి కేసీఆర్ దాచిన ఆ పథకాలేంటనే దానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది.ఇక కేసీఆర్ అంత ధీమాగా చెప్పే ఆ రెండు పథకాలు ఏంటా అని ఆసక్తితో ఎదురుచూస్తున్నారట.ఇక వినండి ఇవేనట కేసీఆర్ అమ్ముల పొదిలోని అస్త్రాలు తెలంగాణ అంతటా ఉచిత వైద్యం-యువతకు ఉద్యోగాల కల్పన ఈ రెండేననే చర్చ గులాబీ ముఖ్యుల వర్గాల ద్వార తెలిసిందట.ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 3.5 కోట్ల మంది మొత్తం జనాభాకు అందరికీ ఉచిత వైద్యం అందిస్తే ఎంతవుతుందని కేసీఆర్ ఆరాతీశారట..



పేదలకు ఉచితంగా..ఉన్నత వర్గాలకు కొంత మొత్తం వసూలు చేసి హెల్త్ కార్డులు ఇచ్చి తెలంగాణ వ్యాప్తంగా ఉచిత వైద్యం అందించేందుకు కేసీఆర్ ఇప్పటికే దీనిపై నివేదికలు-అంచనాలు-ఖర్చుల లెక్కలను తెప్పించుకున్నారట..ఇక ఈ అద్భుత పథకాన్ని వచ్చే 2024 ఎన్నికల ముందర ప్రవేశపెట్టి మళ్లీ అధికారంలోకి వచ్చే స్కెచ్ గీసినట్టు తెలుస్తుందట.ఈ రెండు పథకాలకు బడ్జెట్ కొరతతో కేసీఆర్ ప్రస్తుతానికి పక్కన పెట్టినప్పటికీ భవిష్యత్ లో అధికారంలోకి రావడానికి ఇవే సోపానాలని భావిస్తున్నారట. కేసీఆర్ దాచిన రెండు సీక్రెట్ పథకాలు ఇవేనంటూ ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ఇక తిప్పటానికి మీసం లేదుకాని వాటికి సంపెంగ నూనే కావాలట.ఇప్పటికే ప్రజలు చచ్చేంత ఇబ్బందులు పడుతుంటే మళ్లీ టీ.ఆర్ఎ.స్.వస్తే కట్టుకోవడానికి గుడ్డలుకూడా వుండవని కాంగ్రేస్ వర్గాలు గుసగుసలాడు కుంటున్నాయ ట..అని కొందరు అనుకుంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: