సైబర్ నేరస్థుల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రెప్పపాటు సమయంలో బ్యాంకు ఖాతాలోని డబ్బులను సైబర్ నేరస్థులు దోచేస్తున్నారు. చదువుకున్నవారు, చదువుకోనివారు సైబర్ నేరస్థుల చేతిలో మోసపోతున్నారు. లక్షల రుపాయలు క్షణాల వ్యవధిలో దోచేస్తూ ప్రజల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తున్నారు. బీహార్ రాజధాని పాట్నా నగరంలో 100 రూపాయల రిఫండ్ కొరకు ప్రయత్నించిన వ్యక్తి ఖాతాలో 77 వేల రూపాయలు మాయమయ్యాయి. 
 
విష్ణు అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జొమాటో యాప్ ఉపయోగించి పుడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ డెలివరీ చేసిన పుడ్ లో క్వాలిటీ ఏ మాత్రం లేకపోవటంతో డెలివరీ బాయ్ కు పుడ్ రిటర్న్ తీసుకోమని చెప్పాడు. డెలివరీ బాయ్ ను పుడ్ ఆర్డర్ డబ్బులు విష్ణు అడగగా డెలివరీ బాయ్ కస్టమర్ కేర్ ను సంప్రదించమని చెప్పాడు. విష్ణు వెంటనే గూగుల్ సెర్చ్ లో వెతికాడు. గూగుల్ సెర్చ్ లో దొరికిన కస్టమర్ కేర్ నంబర్ కు విష్ణు కాల్ చేశాడు. 
 
అవతలివైపు నుండి జొమాటో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అని ఒక వ్యక్తి విష్ణుతో మాట్లాడాడు. డెలివరీ బాయ్ డెలివరీ చేసిన పుడ్ లో క్వాలిటీ లేదని మనీ రిఫండ్ చేయాలని విష్ణు కోరాడు. జొమాటో కస్టమర్ కేర్ వ్యక్తి అని చెప్పిన అపరిచితుడు 100 రూపాయలు రిఫండ్ చేయాలంటే 10 రూపాయలు పంపిన లింక్ ద్వారా చెల్లించాలని చెప్పాడు. విష్ణు వెంటనే లింక్ ద్వారా 10 రూపాయలు చెల్లించాడు. 
 
విష్ణు 10 రూపాయలు పంపిన కొంత సమయంలోనే విష్ణు బ్యాంకు ఖాతా నుండి 77 వేల రూపాయలు మాయం అయ్యాయి. 100 రూపాయల రిఫండ్ కోసం ప్రయత్నించిన విష్ణుకు బ్యాంకు ఖాతానే ఖాళీ అయింది. ప్రస్తుతం విష్ణు బ్యాంకు అధికారుల చుట్టూ, పోలీసుల చుట్టూ డబ్బులు వెనక్కు రప్పించాలనే విషయమై తిరుగుతున్నాడు. సైబర్ నిపుణులు కస్టమర్ కేర్ నంబర్ల కొరకు గూగుల్ లో వెతకకుండా సంబంధిత కంపెనీ వెబ్ సైట్ లో ఉన నంబర్లను మాత్రమే సంప్రదించాలని సూచిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: