Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Mon, Oct 21, 2019 | Last Updated 6:26 am IST

Menu &Sections

Search

నాగార్జున యూనివర్శిటీలో నిరసన గళం.. గేట్లకు తాళాలు!

నాగార్జున యూనివర్శిటీలో నిరసన గళం.. గేట్లకు తాళాలు!
నాగార్జున యూనివర్శిటీలో నిరసన గళం.. గేట్లకు తాళాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఈరోజు ఉదయం నాన్ టీచింగ్ ఉద్యోగులు కాసేపు నిరసన తెలిపారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా యూనివర్శిటీ గేట్లకు తాళాలు వేసి నిరసన గళం విప్పారు. తమ ప్రమోషన్లు, జీతాల పెంపు నిలిపివేస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వారు తప్పు పట్టారు. గత ప్రభుత్వ హయాంలో యదావిధిగా కొనసాగిన నిర్ణయాలను కొత్త ప్రభుత్వం నిలిపివేయడం తగదన్నారు. దీంతో తాము నష్టపోతున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ప్రభుత్వానికి పలుమార్లు నివేదించినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


నిజానికి యూనివర్శిటీలో రిటైర్డ్ అయిన వారి తర్వాతి స్థానంలో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చేవని అంటున్నారు. అయితే ఈ విషయంలో గత ప్రభుత్వ హయాంలో అనేక అవకతవకలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి యూనివర్శిటీలో ఇదే పరిస్థితులు నెలకొన్నాయని భావిస్తున్న ప్రభుత్వం ఈ విధానాన్ని నిలుపుదల చేయాలంటూ గతంలో ఆదేశాలిచ్చింది. మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదేశాల మేరకే హయర్ ఎడ్యుకేషన్ అన్ని యూనివర్శిటీలకు అధికారిక ఉత్తర్వులిచ్చిందని సమాచారం. దీంతో యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ ఇవే ఆదేశాలను పాటించి నాన్ టీచింగ్ ఉద్యోగుల ప్రమోషన్లు నిలుపుదల చేశారు. దీనిపై ఆగ్రహిస్తున్న ఉద్యోగులు గత మూడు రోజులుగా పెన్ డౌన్ కూడా చేశారు. ఈ అంశంపై ఉద్యోగులు ఉన్నతాధికారులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. కానీ వారు ప్రభుత్వ ఆదేశానుసారమే తాము నడుచుకుంటున్నామని తెలిపినట్టు సమాచారం. దీంతో ఉద్యోగస్తులు నిరసన తెలిపారు.


ఈ నిర్ణయంతో ఆగ్రహంగా ఉన్న ఉద్యోగులు ఈరోజు యూనివర్శిటీ బయట గేట్లకు తాళాలు వేసి బస్సులను అడ్డుకుని కాసేపు నిరసన తెలిపారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్ కార్యాలయాలను చుట్టుముట్టి ఘెరావ్ చేశారు. మరి ఈ సమస్యపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది తెలియాలి.Protesters at the Nagarjuna University .. Locks for gates

Protesters at the Nagarjuna University .. Locks for gates
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
రష్మిక ఆ సినిమా నుంచి తప్పుకోలేదట.. తప్పించారట!
'మా'లో విబేధాలకు పరిష్కారం చూపేది ఆయనేనా!
'మా' సమావేశం రసాభస.. రాజీనామా చేస్తానంటున్న పృథ్వీ
ప్రభాస్..! చిరు, నాగ్, వెంకీలను ఫాలో అవ్వు.. నెటిజన్ల కామెంట్స్!
మోదీజీ.. సౌత్ సినిమాపై ఇదేనా మీ ప్రేమ: మెగా కోడలు ఉపాసన ట్వీట్
రాష్ట్ర బంద్ ప్రభుత్వానికి ఓ గుణపాఠం: టీఎస్ఆర్టీసీ జేఏసీ
కొనసాగుతున్న బంద్.. నాయకులు, కార్మికులు అరెస్ట్
శ్రీకాంత్ అడ్డాల మెగా ఛాన్స్ పట్టేశాడా..!
రౌడీ స్టార్ కొత్త సినిమా విడుదల ఆ ప్రత్యేక రోజునే!
త్రిషకు క్రేజీ ఆఫర్స్.. మళ్లీ మాయ చేయడం ఖాయమా..!
మెగాస్టార్ మాసివ్ హిట్ 'రౌడి అల్లుడు' కి 28 ఏళ్ళు
ఇకపై డెంగ్యూ, సీజనల్ వ్యాధులకూ ఆరోగ్యశ్రీ: సీఎం జగన్
కాబోయే భర్తలో అవన్నీ ఉండాలంటున్న రష్మిక
నన్నయ్య యూనివర్శిటీ ప్రొఫెసర్ అరెస్టు
చిరంజీవి 152వ సినిమాపై అఫీషియల్ న్యూస్.. ఇదే
ఈ డైరెక్టరైతేనే బెటర్ అంటున్న పవన్ ఫ్యాన్స్
ప్రస్తుతం టాలీవుడ్ లో పోటీ ఈ హీరోయిన్ల మధ్యేనా!
చిరంజీవికి మోహన్ లాల్ చేసిన మరో సాయం ఇదే!
9ఏళ్ల కూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రి!
నేటితో అయోధ్యపై సుప్రీంకోర్టులో వాదనలు పూర్తి!
ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ దారుణ హత్య.. ఘటనపై సీఎం సీరియస్
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.