కొందరు మగాళ్లు ఆడవాళ్లను ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారంటే సినిమాలో కూడ అన్ని వేశాలు వుండవేమో.ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఆడదాని పట్ల కోరిక,డబ్బు పట్ల వ్యామోహ.క్షణంలో రగిలి మరుక్షణంలో చల్లబడే సుఖం కోసం చేయరాని నేరాలు,దారుణాలు,హింసలు చేస్తూ చెప్పకూడని అబద్దాలు చెబుతు,నమ్మించి లొంగతీసు కుంటున్నారు.ఇక అమ్మాయిలు అలాంటి వాడి ప్రవర్తన పసిగట్టలేకన,లేక అటువంటి వారి నుండి తప్పించుకోలేకన.వారిని వారు తక్కువ అంచన వేసుకోవడం మూలాన. దేనివల్ల లొంగిపోతున్నారో అర్ధం కాదు.తెలిసిన వారు కాని తెలియని వారు కాని ఎవరైన,ఎవరి దగ్గరకైన ఎక్కడికైన,ఒంటరిగా వెళ్లేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోమని చట్టం చెవ్వులు చిల్లులు పడేలా చెబుతుంది.



ఈ మాత్రం తెలియని వారు చదువుకుని,ఉద్యోగాలు చేసి ఎవ్వరిని ఉద్దరిస్తారో అర్ధం కాదు.ఇక ఎవడి చేతికైన చిక్కినప్పుడు ప్రాణం ముఖ్యమనుకున్న వారు మానాన్ని కోల్పతున్నారు.మానమే ముఖ్యమనుకున్న వారు ప్రాణాలు కోల్పోతున్నారు.ఈ రెండు కోల్పోకుండా బయట పడలేరా ఆలోచించండి.అమ్మాయిలు మీరు లొంగుతున్నంత కాలం అత్యాచారాలు జరుగుతూనే వుంటాయి.ఇక ఒకడు ఉద్యోగమని చెప్పి అమ్మాయిని ఇంటర్వ్యూ కు పిలిపించుకుని 24 గంటలసేపు తనతో గడిపి ఎవరికైన చెప్పితే ఇప్పటిదాక తీసిన వీడియోలను అందరికి చూపిస్తానని బెదిరించాడట.అసలు అక్కడ జరిగిందేంటో గాని ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది విందాం.ఇంటర్వ్యూ అని హోటల్ రూముకు పిలిచి ఒక 28 ఏళ్ల ఎంబిఎ గ్రాడ్యుయేట్‌పై అత్యాచారానికి పాల్పడిన ఒక ఢిల్లీ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు.



ఉత్తర్ ప్రదేశ్‌లోని తన స్వగ్రామం నుంచి ముంబైకు వచ్చిన ఒక యువతి వసతి గృహంలో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుందట.కొన్ని రోజుల తర్వాత జాబ్ మానేసి స్వంత ఊరుకు ఆమె వెళ్లిపోయి మళ్లీ ముంబాయికి తిరిగి వచ్చిన ఆమె ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ సైట్లలో మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగిస్తోంది.ఆ ప్రయత్నంలో సాహిల్ సింగ్ అరోరా అనే వ్యక్తి ఆమెను సంప్రదించి రూ. 30,000 నెల జీతం ప్యాకేజీతో ఒక ప్రైవేట్ బ్యాంకులో హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడట..దాని కోసం జుహులోని ఒక హోటల్‌లో ఇంటర్వూకు హాజరుకావాలని ఆమెకు ఫోన్ చేశాడు.ఇంటర్వూ కోసమని వచ్చిన ఆమె గదిలోకి ప్రవేశించగానే తలుపు లాక్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అలా మరుసటి రోజు వరకు ఆమెపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడి ఎవరికీ చెప్పవద్దని,చెబితే వీడియోలను ఆమె తండ్రికి పంపిస్తానని బెదిరించాడట.అయితే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరోరాను అరెస్టు చేశారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: