సినిమా వాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి వెళ్తున్నారు. అలాగే రాజకీయ నాయకులు చాలామంది సినిమా లో కూడా కనిపిస్తుంటాడు. ఇదంతా ఇప్పుడు ట్రెండ్ గా మారింది . ఈ నేపథ్యంలోనే దివంగత మాజీ ఎంపీ శివప్రసాద్ విభిన్నమైన పాత్రలను చేస్తూ అటు రాజకీయాలు ఇటు సినిమాలో రాణిస్తుండేవారు. అయితే ఇటు టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఓ వైపు సినిమాలు మరో వైపు రాజకీయాలు ఈ రెండింటిలో సక్సెస్ ఫుల్ గా  రాణిస్తున్నారు. 

 

 

 అయితే కొంతమంది సినిమాలో నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం రాజకీయాలకే పరిమితం అయిపోతారు.అయితే  ప్రజెంట్ ఈ మ్యాటర్  ఎందుకు వచ్చిందంటే. ప్రస్తుతం ఏపీ  డిప్యూటీ సీఎం ఓ సినిమాలో నటించబోతుంది. ఏపీ డిప్యూటీ సీఎంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న పాముల పుష్ప శ్రీవాణి ఓ సినిమాలో నటిస్తుంది. "అమృత భూమి" అనే సినిమాలో పుష్పశ్రీవాణి   టీచర్ పాత్రలో కనిపించనున్నారు . ఈ సందర్భంగా విజయనగరం లోని గుమ్మలక్ష్మీపురం మండలంలోని లోవ ముఠా  ప్రాంతం గొరడా గ్రామంలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. కాగా షూటింగ్ లో భాగంగా టీచర్ పాత్రలో నటిస్తున్న డిప్యూటీ సీఎం పుష్ప  శ్రీవాణి పై కొన్ని సీన్లు షూట్ చేశారు. 

 

 

 ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల చైతన్య పరచడానికి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని ఆమె తెలిపింది. అయితే మరో అధికారి పాత్రలో కలెక్టర్ హరిజవహర్ లాల్ కూడా కనిపించనున్నారు. అనంతరం నటుడు  రాజ ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన  పెంచి వారిలో చైతన్యం కలిగించడానికి ఈ చిత్రం రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జానపద కళాకారుడు వంగపండు బృందం సభ్యులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: