బిజెపి ప్రభుత్వం  సంచలన నిర్ణయాలతో  అందరినీ షాక్ కి  గురి చేస్తుంది . సంచలన ప్రతిపాదనలను  రోజుకొకటి తెరమీదకు తెస్తుంది  బిజెపి ప్రభుత్వం. మొన్నటి వరకు "ఒకే దేశం ఒకే ఎన్నిక", " ఒకే దేశం ఒకే భాష" అన్న ప్రతిపాదనను తెరమీదకు తెచ్చిన బీజేపీ ప్రభుత్వం పై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. జెమిలి ఎన్నికల విషయంలో ఎక్కువ శాతం మంది సానుకూలంగానే స్పందించారు.కానీ  ఒకే దేశం ఒకే భాష అనే బిజెపి ప్రతిపాదనపై మాత్రం విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ ప్రతిపాదనపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. 

 

 

 ఈ నేపథ్యంలో బిజెపి మరో ప్రతిపాదనను తెరమీదకు తెచ్చి సంచలన నిర్ణయం తీసుకుంది . ప్రస్తుతం బిజెపి తెరమీదకు తెచ్చిన నూతన  ప్రతిపాదన ఏంటంటే  వన్ నేషన్ వన్ కార్డు . అంటే  ప్రస్తుతం ప్రజలందరూ లైసెన్స్, పాన్ కార్డ్,  ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డు, ఇలా రకరకాల కార్డులు  వినియోగిస్తున్న  విషయం తెలిసిందే. అయితే ప్రస్తుత ప్రతిపాదన ఉద్దేశ్యం ఏమిటంటే... ప్రజలు ఇవన్నీ కార్డులతో ఇబ్బంది పడకుండా ప్రస్తుతం ఉపయోగిస్తున్న కార్డులు  అన్నిటిని  ఒకే గొడుగు కిందికి తేవటం . బ్యాంక్ అకౌంట్,  డ్రైవింగ్ లైసెన్స్,  పాస్ పోర్ట్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్,  ఇలాంటి గుర్తింపు కార్డులు అన్నింటిని కలిపి ఒకటే కార్డుగా రూపొందించడం యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలిపారు అమీషా. 

 

 

 అంతేకాకుండా 2021 జనాభాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రత్యేకమైన మొబైల్ యాప్ రూపొందించి... జనగణమనను డిజిటల్ రూపంలో చేపడతామని తెలిపారు. అంతే కాకుండా జాతీయ జనాభా పట్టి  రూపొందిస్తామని వెల్లడించారు. దేశంలో ఎక్కడైనా ఎవరైనా చనిపోతే.... వారి వివరాలు ఆటోమేటిక్ గా  అప్డేట్ అయ్యేవిధంగా కొత్త వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు అమిత్ షా.

మరింత సమాచారం తెలుసుకోండి: