తెలంగాణ ఆడ‌ప‌డుచుల‌కు ప్ర‌భుత్వం ఇస్తున్న బ‌తుకమ్మ చీర‌ల పంపిణి కార్య‌క్ర‌మం షూరూ అయింది. త‌లెంగాణ‌లో ప్ర‌తి ఏటా తెలంగాణ స‌ర్కారు బ‌తుక‌మ్మ చీర‌ల‌ను పంపిణి చేస్తుంది. ఈ ఏడాది దాదాపుగా 1.20 ల‌క్ష‌ల చీర‌ల‌ను పంపిణి ల‌క్ష్యంగా పెట్టుకుని అందుకు త‌గిన విధంగా చీర‌ల‌ను ఉత్ప‌త్తి చేయించింది. సుమారు రూ.780 కోట్ల‌కు పైగా వ్య‌యంతో బ‌తుక‌మ్మ చీర‌ల‌ను 100 వెరైటీల‌ను త‌యారు చేయించిన తెలంగాణ స‌ర్కారు మొద‌టి చీర‌ను మేడారం స‌మ్మ‌క్క సార‌క్క‌కు అందించారు. తెలంగాణ రాష్ట్ర గిరిజ‌న, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ మొద‌ట‌గా మేడారంలో కొలువైన స‌మ్మ‌క్క సార‌క్క‌కు అందించి బ‌తుక‌మ్మ పండుగ చీర‌ల పంపిణి కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.


ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ ముమ్మ‌రంగా  కొనసాగుతుంది. అందులో భాగంగా గిరిజన శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్వవతి రాథోడ్ మేడారంలో సమ్మక్క-సారలమ్మల‌ను సోమ‌వారం అమ్మ‌ల‌ను  దర్శిచుకొని చీరలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రిగా తన తొలి పర్యటన గిరిజన ప్రాంతంలో జరపడం బతుకమ్మ పండగ చీరల పంపిణీతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆనందించదగ్గ విషయమన్నారు. గిరిజన తండాలో పుట్టి, పెరిగిన తనకు ముఖ్యమంత్రి మంత్రివర్గంలో స్థానం కల్పించడం బాధ్యత పెంచిందన్నారు.


సీఎం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాలనే కోరికతో మేడారం సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని, బతుకమ్మ తొలి చీరలను అమ్మవార్లకు సమర్పించానన్నారు. అనంతరం ఆమె ములుగులో చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బ‌తుక‌మ్మ చీర‌ల‌ను ప్ర‌భుత్వం ముమ్మ‌రంగా పంపిణి చేస్తుంది. జిల్లా మంత్రులు త‌మ నియోజ‌క‌వ‌ర్గ కేంద్రాలు, మండ‌ల కేంద్రాలు, ఇత‌ర నియోజ‌కవ‌ర్గాల్లో పంపిణిని జోరుగా సాగిస్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం బ‌తుక‌మ్మ పండుగ‌కు ముందే చీర‌లు పంపిణి చేస్తుండ‌టం, 100 వెరైటీలు త‌యారు చేయించ‌డంతో మ‌హిళ‌లు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: