నరసరావు పేట అంటే కోడెల.. కోడెల అంటే నరసరావు పేట అనే విధంగా ఉండేది.  ఇప్పుడు కాదు ఒకప్పుడు.  2014 ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు కారణంగా నరసరావుపేట టికెట్ ను బీజేపీకి కేటాయించారు.  కోడెలకు సత్తెనపల్లిని కేటాయించారు.  సత్తెనపల్లిలో కోడెల విజయం సాధించిన సంగతి తెలిసిందే.  మొత్తం కోడెల ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.  నరసరావుపేట నియోజక వర్గాన్ని అభివృద్ధి చాలా వరకు అభివృద్ధి చేశారు.  


డాక్టర్ గా వైద్యం చేస్తూనే..ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తూ వచ్చారు.  అయితే, 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఓటమిపాలయ్యాక అయనకు పార్టీ దూరంగా ఉంటూ వస్తున్నది.  2019లో తన కొడుకుకు నరసరావుపేట నుంచి సీటు ఇవ్వాలని టిడిపిపై ఒత్తిడి తీసుకొచ్చినా .. బిసి వర్గానికి చెందిన చదలవాడకు సీటు ఇచ్చారు.  అయితే, వైకాపా ప్రభంజనంలో ఆ నియోజక వర్గంలో కూడా టీడీపీ ఓడిపోయింది.  


గత కొన్ని రోజులుగా కోడెలపై అనేక అభియోగాలు రావడం, కుటుంబం నుంచి ఒత్తిళ్లు పెరగడంతో కోడెల ఆత్మహత్య చేసుకున్నారు.  కోడెల ఆత్మహత్య చేసుకోవడంతో టిడిపి ఒక్కసారిగా షాక్ అయ్యింది.  కోడెల ఆత్మహత్య చేసుకోవడం వెనుక వైకాపా ఉందని, వైకాపా ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు వచ్చాయి.  కానీ, వైకాపా మాత్రం దాన్ని అంగీకరించం లేదు.  కోడెలపై ప్రభుత్వం ప్రత్యక్షంగా ఎలాంటి కేసు పెట్టలేదని స్పష్టం చేసింది.  ఇది అయిపోయిన కథ.  పోయిన తరువాత ఎన్ని అనుకున్నా లాభం లేదు.  


కాగా, ఇపుడు కోడెల లేరు కాబట్టి ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తున్నారు.. కోడెలను తలపించేలా టిడిపిలో నరసరావు పేట నియోజక వర్గానికి నాయకులు దొరుకుతారా లేదా.. కోడెల కొడుకు శ్రీనివాస్ కు పార్టీ కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.  అయితే, రాజకీయాల్లోకి రాకముందే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.  తండ్రిని అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.  ఇప్పుడు తండ్రిపై చేయి చేసుకున్నారని వార్తలు కూడా వచ్చాయి.  ఈ వార్తల నేపథ్యంలో శ్రీనివాస్ తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తారని అనుకోవడం లేదు.  కోడెల తనయుడు కాకుండా ఎవరిని ఆ సాహనంలో నిలబెట్టబోతున్నది అన్నది తెలియాలి.  రాయపాటి వర్గానికి చెందిన వ్యక్తులకు సత్తెనపల్లి నియోజక వర్గాన్ని అప్పగించే ఆలోచనలో బాబు ఉన్నట్టు సమాచారం.  


మరింత సమాచారం తెలుసుకోండి: