స్కూలుకెళ్లే పిల్లలకు ఉపాధ్యాయులు  ఏం బోధిస్తారు ? మంచి నడవడిక క్రమశిక్షణ అలవర్చుకోవాలని చెప్తారు. భవిష్యత్తులో మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి వివిధ రకాల పాఠాలను బోధిస్తారు ఉపాధ్యాయులు. కానీ ఇక్కడ మాత్రం ఉపాధ్యాయులు పిల్లలకు సెక్స్ పాఠాలు బోధిస్తున్నారు. చిన్నప్పట్నుంచి సెక్స్ పై పూర్తి అవగాహన కల్పిస్తున్నారు. చిన్నపిల్లలకి సెక్స్ పాఠాలు నేర్పించటం ఏంటని మీరు  షాక్ అయ్యి ఉంటారు... కానీ ఇది నిజమే. రోజు రోజుకి రేపులు,  లైంగిక వేధింపులు పెరిగిపోతున్న  తరుణంలో చిన్నప్పట్నుంచి పిల్లలకు సెక్స్ పై అవగాహన ఉంటే ఇలాంటి అనర్ధాలు జరగవని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సహా కొంతమంది నటులు పాఠశాల నుండే  పిల్లలకి లైంగిక  అవగాహన కలిగి ఉంటే  బాగుంటుందని  అభిప్రాయం వ్యక్తం చేశారు. 

 

 అయితే తాజాగా యూకేలోని పలు స్కూళ్లలో సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు చెప్పేందుకు  సిద్ధమయ్యాయి అల్లాడి విద్యా సంస్థలు . అక్కడ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు ఆరేళ్ల వయసు అప్పటి నుంచి సెక్స్ పాఠాలు బోధిస్తున్నాయి  అక్కడి స్కూలు. యూకేలో  240 కి పైగా ప్రైమరీ స్కూల్లో ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అమల్లో ఉంది. విద్యార్థుల్లో లైంగిక అవగాహన పెంచడానికి సెక్స్ ఎడ్యుకేషన్ పాఠాలు బోధించేందుకు స్కూలు నిర్ణయించినట్లు తెలిపారు స్కూల్ యాజమాన్యాలు. దీని వల్ల విద్యార్థులకు లైంగిక అవగాహన కలిగి ఉండి ఎలాంటి అనర్ధాలు జరగవని అక్కడి వారు నమ్ముతున్నారు.

 

 

 కాగా ఈ సెక్స్  ఎడ్యుకేషన్ పాటలలో భాగంగా జననాంగాల స్పర్శ గురించి పిల్లలకు అవగాహన కల్పిస్తున్నట్లు యూకే విద్యాశాఖ స్పష్టం చేసింది. సెక్స్ ఎడ్యుకేషన్ పాటల్లో భాగంగా పిల్లల ప్రైవేట్ పార్ట్స్ని తాగడం లాంటివి చేసి వారిపై లైంగిక దాడి చేసే వారి నుండి ఎలా  దూరంగా ఉండాలి అన్న దానిపై  అవగాహన కల్పిస్తున్నట్లు అక్కడి టీచర్లు చెబుతున్నారు . కాగా  ఈ సెక్స్ ఎడ్యుకేషన్ పై విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం ఆందోళన  వ్యక్తం చేస్తున్నారు. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ వల్ల ఎన్నో అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని తమ పిల్లలు పెడదోవ పట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లితండ్రులు . కొంతమంది తల్లిదండ్రులు ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అమలు చేసిన స్కూల్ నుంచి తమ పిల్లల అడ్మిషన్  క్యాన్సిల్ చేసుకుని తమ పిల్లల్ని  వేరే స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: