చరిత్రకారుడు చెప్పినట్లుగా దేశాన్ని బాగు చేయాలంటే విశ్వ విద్యాలయాలను బాగు చేయండి అదే దేశాన్ని నాశనం చేయాలంటే విశ్వ విద్యాలయాలను నాశనం చేయండి అని, ఇది ముమ్మాటికీ సత్యమైన మాటే కదా? 


భారత ఖండమునకు మేధో భాండాగారాలను తయారు చేసిన నలంద, తక్షశిల వంటి  విశ్వ విద్యాలయములకు నిలయమైన ఈ కర్మ భూమిలో విశ్వ విద్యాలయాలు ఇంకెంత బాధ్యతగా మెలగాలి ?


ఒక వికలాంగునిపై మాటలతో, హావ భావాలతో దాడి అంటే సమ సమాజం తలదించుకోవాల్సిన ఘటన, సభ్య సమాజంలో తన కష్టార్జితంతో, భగవంతుడు తనకిచ్చిన లోపాన్ని ప్రక్కన పెట్టి మరీ శ్రమ చేసుకుంటూ కుటుంబాన్ని స్వార్జితంతో పోషించుకుంటున్నవారిపై మాటలతో, హావ భావాలతో దాడి వంటి అఘాయిత్యం సమర్థనీయం కాదు కదా? 


సభ్య సమాజంలోనే జరగ కూడని ఈ ఘటన, ఘనత వహించిన విశ్వ విద్యాలయం లో జరగడం అది కూడా సాక్షాతూ ఇంచార్జి రెజిస్ట్రార్ కార్యాలయంలో జరగడం... ఇలా జరగడానికి కారణభూతమయ్యింది సాక్షాత్ ఇంచార్జి రిజిస్ట్రార్ కావడం తప్పనిసరిగా గర్హనీయం కదా అంటున్నారు ఆంధ్ర ప్రజ?
ఇలా జరిగింది అని  చెప్పడానికే బాధవేసే ఘటనకు వేదికయ్యిందట ఘనత వహించిన ఎస్వీ యూనివర్సిటీ...  ఎస్వీ యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ కార్యాలయమే ఈ బాధాకరమైన ఘటనకు కర్త - కర్మ - క్రియ అట?


అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే ఈ ఘటన జరిగి దాదాపు పది రోజులు కావస్తున్నా దీనిపై ఎస్వీ యూనివర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ యొక్క స్పందన శూన్యం. ఈ విషయంపై ఇంచార్జి రిజిస్ట్రార్ యొక్క స్పందన గురించి ఇండియా హెరాల్డ్ చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీరే అయ్యాయి.


ఇటివంటి ఘటనలతో 65  సంవత్సరాల చరిత్ర కలిగిన ఎస్వీ యూనివర్సిటీ ప్రతిష్ట మసక బారుతుందని తెలిసినా... నవ్విపోదురు గాక నాకేటి అన్నట్లుంది మా ఇంచార్జి రిజిస్ట్రార్ గారి పరిస్థితి అని చెవులు కొరుక్కుంటున్నారట ఎస్వీయూ పరిధిలోని  విద్యార్థులు, ఆచార్యులు, బోధనేతర సిబ్బంది.


సభ్య సమాజంలో ఇటువంటి అమానుష ఘటనలు జరగడం, అదీ విశ్వ విద్యాలయాల్లో జరగడం, అదీ సాక్షాత్తు ఇంచార్జి రిజిస్ట్రార్ ఆఫీస్ లో జరగడం, దానికి కారణభూతం సాక్షాత్తు ఇంచార్జి రిజిస్ట్రార్ కావడం...


ఇవన్నీ పారదర్శక పాలనను అందించడమే ధ్యేయంగా పెట్టుకున్న జన ప్రియ నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  శ్రీ వైఎస్ జగనమోహన రెడ్డి గారి దృష్టికి వెళ్తుందని... ఇటువంటి అమానుష ఘటనలు మరెక్కడా జరగకుండా ఉండాలని ఆశిస్తున్నారు ఆంధ్రప్రజ, మరి మీరేమంటారు ?


వికలాంగునిపై ఎస్వీయూ అఘాయిత్యం గురించి మరిన్ని పరిశోధనాత్మక విశ్లేషణలు: 























మరింత సమాచారం తెలుసుకోండి: