వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలుగుదేశంపార్టీని గెలిపించుకోవాలని  చంద్రబాబునాయుడు ఇప్పటి నుండే పావులు కదుపుతున్నారా ? అవుననే అంటున్నాయి పార్టీతో సన్నిహితంగా ఉండే  వర్గాలు. మొన్నటి ఎన్నికల సందర్భంగా ప్రశాంత్ కిషోర్ (పికె)ను జగన్మోహన్ రెడ్ది రాజకీయ వ్యూహకర్తగా నియమించుకున్న విషయం తెలిసిందే. పికె మంచి వ్యూహకర్తగా పేరుంది. అందులోను పికేకి సక్సెస్ రేటు ఎక్కువ కాబట్టే మంచి డిమాండ్ లో ఉన్నారు.

 

సరే ప్రస్తుత విషయానికి వస్తే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలన్న పట్టుదలతో ఉన్నారు చంద్రబాబు. అంటే ఎన్నికలు జరిగేది ఇప్పుడే కాదు లేండి.  అందుకోసం రాబిన్ శర్మ అనే వ్యూహకర్తతో చంద్రబాబు కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఈ రాబిన్ శర్మ ఎవరయ్యా అంటే ఒకపుడు పికేకు అత్యంత సన్నిహితుడని ప్రచారంలో ఉంది.

 

చాలాకాలం పికే, శర్మ ఇద్దరూ కలిసే పనిచేశారు. అయితే వివిధ కారణాలతో పికే కంపెనీ ఐ ప్యాక్ ను శర్మ వదిలేసి సొంతంగా మరో కంపెనీ పెట్టుకున్నారట. ఆయనతోనే చంద్రబాబు ఇపుడు కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు సమాచారం. మరి వ్యూహకర్తలతో కాంట్రాక్టటంటే భారీగానే ఉంటుందనటంలో సందేహం లేదు.

 

అసలు ముందు పికేతోనే కాంట్రాక్టు పెట్టుకోవాలని చంద్రబాబు ప్రయత్నం చేశారట. కానీ ఎందువల్లో వర్కవుటవ్వలేదు. దాంతో  ఒకపుడు పికేకు సన్నిహితుడైన రాబిన్ శర్మను చంద్రబాబు కాంటాక్టు చేశారట. రాబిన్ కూడా ఇపుడిపుడే ఎదుగుతున్నారు. కాకపోతే పికేతో కలిసి పనిచేశారు కాబట్టి పనిచేసే విధానంలో గుట్టుమట్లు తెలిసే ఉంటుందటనంలో సందేహాలు లేదు.

 

అందుకనే ఇద్దరి మధ్య  దీర్ఘకాలిక కాంట్రాక్టు కుదురినట్లు తెలుస్తోంది. సుమారు రూ. 100 కోట్లతో కాంట్రాక్టు కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. పోయిన ఎన్నికల్లో రాష్ట్రంలోని సర్వేల పేరుతో బీహార్ బందిపోట్లు వచ్చారని పికే బృందాన్ని ఎక్కడపడితే అక్కడల్లా చంద్రబాబు ఆరోపించిన విషయం తెలిసే ఉంటుంది. మరి రాబిన్ శర్మతో కుదుర్చుకున్న కాంట్రాక్టు ను చంద్రబాబు ఏమంటారో వినాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: