ఏపీలో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువమంది తొలిసారి మంత్రులైన వారే ఉన్నారు. అయితే తొలిసారి మంత్రులు కావడంతో వారు..తమ శాఖలపై పట్టు సాధించేందుకు కాస్తా కష్టపడుతున్నారు. కానీ తొలిసారి మంత్రి అయిన ఆదిమూలపు సురేష్ మాత్రం ఏదో సీనియర్ మంత్రి లాగా తన విద్యాశాఖని పరుగులు పెట్టిస్తున్నారు. తన శాఖ గురించి మాట్లాడే ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని చెబుతున్నారు.


అయితే ఇంతలా సురేష్ అవగాహన ఉండటానికి కారణం....తన చదువే. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లో డాక్టరేట్ తీసుకున్న సురేష్...ఇండియన్ రైల్వేస్ లో డిప్యూటీ ఫైనాన్స్ ఆఫీసర్ గా పని చేశారు. ఆ తర్వాత వైఎస్సార్ మీద అభిమానం, రాజకీయాల పట్ల ఆసక్తితో తన ఉద్యోగాన్ని వదిలి కాంగ్రెస్ లో చేరి 2009 లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుంచి గెలుపొందారు. ఆ తర్వాత వైఎస్ మరణంతో కాంగ్రెస్ ని వీడి జగన్ వెంట నడిచారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి సంతనూతనలపాడు గెలిచారు. మళ్ళీ మొన్న ఎన్నికల్లో యర్రగొండపాలెం నుంచి గెలిచి....జగన్ కేబినెట్ లో విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.


పదవి చేపట్టిన దగ్గర నుంచి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలని, ప్రైవేట్ వాటికి ధీటుగా నిలపాలనే జగన్ కల సాకారం చేయడానికి కష్టపడుతున్నారు. అలాగే నిరక్షరాస్యతను సున్నాకు తీసుకురావాలన్నదే లక్ష్యంతో పని చేస్తున్నారు. అలాగే స్కూళ్ళలో మౌలిక సదుపాయాలు పెంచి...ప్రతి స్కూలుని ఇంగ్లీష్ మీడియంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఇవన్నీ ఒక ఎత్తు అయితే పిల్లలని స్కూళ్ళకి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ. 15 వేలు ఆర్ధిక సాయం చేసేందుకు’ అమ్మ ఒడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం జనవరి 26 నుంచి మొదలు కానుంది. ప్రతి తల్లి..తన బిడ్డని పాఠశాలకు పంపడమే లక్ష్యంగా జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు సురేష్ సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకెళుతున్నారు.


ఇలా శాఖా ప‌రంగా ఆయ‌న‌కు టాప్ మార్కులే వేయాలి. ఇక మంత్రిగానే కాకుండా ఆదిమూలపు అధికార నేతగా...టీడీపీ చేసే విమర్శలని ఎక్కడికక్కడే తిప్పికొట్టి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేగా తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. మొత్తం మీద ఆదిమూలపు విద్యాశాఖ మంత్రిగా అద్భుతంగా రాణిస్తున్నారనే చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: