ఒక కాకి చనిపోతే పది కాకులు దాని చుట్టూ చేరి బాధగా అరుస్తాయి ఆ కాకి దగ్గరికి ఏ కాకిని రాకుండా చూట్టూ రక్షణ కవచంలా ఉంటాయి.నేటి ఈ సమాజంలో కాకులకున్న ఐకమత్యం కూడా కనిపించడంలేదు.మరణించిన కాకి కోసమే అన్ని కాకులు గోల పెడుతుంటే,అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తిని వికలాంగుడని కూడా చూడకుండా అతని పట్ల దారుణంగా,కౄరంగా ప్రవర్తించి,మానసికంగా హింసించిన సంఘటన జరిగి వారం నుండి పది రోజులు కావస్తుంది..



అయినా ఈ విషయం పై ఇంతవరకు స్పందన లేదు.అంటే మనం నిజంగా మానవ సమాజంలోనే ఉన్నామా,అది మనుషుల మధ్య వుంటున్నామా అనే అనుమానం వస్తుంది.ఇక ఎస్వీయూ లో జరిగిన విషయం తెలిసిన కామన్ పీపుల్స్ దయ,జాలి అతని పట్ల కనపరుస్తున్నారు.కాని యూనివర్సిటీ అధికారులుగాని,మరే ఇతర నాయకులు గాని ఇంతవరకు స్పందించలేదు.ఇక ఇక్కడున్న ఎస్వీయూ రిజిస్ట్రార్ ఇంతకు ముందు ఉన్న అధికార పార్టీ యొక్క ఎజెండాను తన భుజ స్కంధాలమీద మోస్తూ, అమాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.



విద్యార్ధులు ఎంతమంది తమ నిరసనలు తెలియ చేసిన ఈ యూనివర్సిటిలో పాప ప్రక్షాళన జరగడం లేదు.సమాజంలో సాటి మనుషులను ప్రేమించలేని వారు పదవులను ఏలి ఇంకే న్యాయం చేస్తారు.ఇది ఒక్కరి మాటో కాదు అన్యాయాల మీద ఆవేశపడే ప్రతి మనసున్న మనిషి మనసులోనుండి వచ్చే మాటలు.విద్యార్ధుల వేదనల రోదనలు.....ఇప్పటి వరకు రక్తపు మాంసాలు కనబడకుండా ఈ దేహానికి చర్మం ముసుగులా మాత్రమే వుంది.



కాని ఆముసుగుకే ముసుకేసి అరాచకం, అన్యాయం, అవినీతి, దోపిడి అని ఇలా పలురకాల పాపపు ముసుగులు ఇంకా మనిషిలో ఉన్నాయి.దేహం పైవున్న చర్మం కనిపిస్తే.ఈ పాపపు ముసుగులు కనిపించక తోటి వారి జీవితాలతో ఆడుకుంటూ వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి..ఇలాంటి చర్యలేనా పుణ్య భూమి నాదేశం అన్న మహనుభావుల మాటలకు అర్ధం..ఇలా ఈ యూనివర్సిటీ విద్యార్ధులు అందరుకలసి తమ ఆవేదనను పంచుకుంటున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: