హైదరాబాద్ నగరంలో మగళవారం  నిర్వహించనున్న బతుకమ్మ చీరల పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ఈకాలంలో అర్హులైన లబ్దిదారులకు పంపిణీ చేసేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టింది. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనే ప్రముఖుల వివరాలు ఎలా ఉన్నాయి..మంగళవారం ఉదయం 8:30గంటలకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ బోయగూడలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.అనంతరం  ఉదయం 9:30గంటలకు అమీర్ పేట్ వివేకానందనగర్ కమ్యునిటీహాల్ లోనూ, ఆ తర్వాత ఉదయం10:30  గంటలకు మంత్రి తలసాని అంబర్ పేట్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.



ఈ క్రమంలోనే ఉదయం 10గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కర్మాన్ ఘాట్ సుమంగళి ఫంక్షన్ హాల్ లో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11గంటలకు  ఎన్.టి.ఆర్ నగర్, భగత్ సింగ్ నగర్ లలో జరిగే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొంటారు.ఉదయం 11గంటలకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ మల్లాపూర్ వి.ఎన్.ఆర్ ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11గంటలకు  రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మూద్ అలీ మలక్ పేట్ లోని ఆజాం ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. 




ఉదయం 11గంటలకు శాసన సభ ఉప సభాపతి టి. పద్మారావు సీతాఫల్ మండిలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని పేదలకు బతుకమ్మ చీరలను అందచేస్తారు. ఉదయం 11గంటలకు డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ యూసుఫ్ గూడ మహంకాళి ఫంక్షన్ హాల్ లో పాల్గొంటారు. ఆ తర్వాత  మధ్యాహ్నం 1గంటలకు  బహుదూర్ గూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటి మేయర్  ఫసియుద్దీన్ పా ల్గొంటారు. కాగా ఉదయం 11:30గంటలకు రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ గోషామహల్ నియోజకవర్గంలోని ఆబిడ్స్ ఫంక్షన్ హాల్ లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. 








మరింత సమాచారం తెలుసుకోండి: