విశ్వవిద్యాలయాలు అంటే జ్ఞాన భాండాగారాలు. ఎంతోమంది మేధావులను తయారుచేసి భరతమాత తలరాతను మార్చే శక్తి విశ్వవిద్యాలయాలకు ఉంది . విశ్వవిద్యాలయాలు అంటే అనంతమైన మేధా సంపత్తికి క్రమశిక్షణకు పెట్టింది పేరు. అలాంటి విశ్వవిద్యాలయంలో అంగవైకల్యం ఉన్న ఒక వ్యక్తికి అవమానం జరగడం బాధాకరం. ఎంతో పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం మరింత బాధాకరం. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన  ఉపాధ్యాయులే బుద్ధి లేకుండా ప్రవర్తించారు. ఒక అంగవైకల్యుడిపై  పై ప్రతాపం చూపించి అన్ని ఉన్న అంగవైకల్యులుగా  వారు ప్రవర్తించారు. 

 

 

 విశ్వవిద్యాలయానికి సేవలు అందించేందుకు వచ్చిన కంపెనీ ప్రతినిధి ఒక  అంగవైకల్యము గల వ్యక్తి  అని కూడా చూడకుండా మాటలతో దాడి చేసి హావభావాలను కించపరిచిన ఎస్వీయూ సిబ్బంది... ఎస్వీయూ  ఘన చరిత్రను గంగలో కలపాలనుకుంటున్నారు. అయితే ఈ తంతు అంతా సాక్షాత్తు ఇన్ఛార్జ్ రిజిస్టర్ కార్యాలయంలోనే జరగడం బాధాకరం. అసలు సభ్యసమాజం లోనే జరగకూడని ఘటన... ఎన్నో కీర్తి ప్రతిష్టలు కలిగిన విశ్వవిద్యాలయంలో జరగడం సభ్య సమాజానికి తలదించుకునేలా ఉందంటున్నారు  ఆంధ్ర ప్రజలు. 

 

 

 అయితే ఈ ఘటన జరిగి 10రోజులు గడుస్తున్న ఎస్వీయూ  ఇన్చార్జ్ రిజిస్టర్  యొక్క స్పందన శూన్యం. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఎస్ వి యూనివర్సిటీ కి మచ్చలాగా మారిన ఈ ఘటన పై కనీసం ఇంచార్జి రిజిష్టర్  స్పందించకపోవడంతో... ఎస్వీయూ  యూనివర్సిటీ పై మాయని మచ్చ పడిన సరే  ఇంచార్జి రిజిష్టర్  కి మాత్రం కనీసం చీమకుట్టినట్లు కూడా లేదా... ఎంత దౌర్భాగ్యం ఎంత నిర్లక్ష్యం అనుకుంటున్నారు ఎస్సియూ విద్యార్థులు. ఎంతోమంది మేధావులను తయారు చేసే  విశ్వవిద్యాలయాల్లో...ఇలాంటి  నిరంకుశత్వాన్ని రూపుమాపాలంటే  ... ఈ విషయం ప్రజానాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి  వెళ్లి... ఇలాంటి ఘటనలు మరెక్కడ పునరావృతం కాకుండా చూడాలని ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: