65 సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన ఎస్వి యూనివర్సిటీ ప్రతిష్టను  అప్రతిష్ట పాలు  చేస్తున్నారు ఎస్వీయూ  ఇంచార్జ్ రిజిస్టర్ సార్. ఎస్వియూకి  సేవలందించేందుకు వచ్చిన ఓ  కంపెనీ ప్రతినిధిపై వికలాంగుడు అని కూడా చూడకుండా నిర్బంధించి  మూకుమ్మడిగా  సూటిపోటి మాటలతో దాడి చేశారు కొంతమంది ఎస్వీయూ  సిబ్బంది. సర్ ప్లీజ్ సర్ నన్ను వదిలేయండి నేనొక వికలాంగుని అని  బ్రతిమిలాడినా  కనీస కనికరం చూపలేదు. ఇదంతా ఇన్చార్జి రిజిస్టర్ కార్యాలయంలోనే జరగడం.... అంతకుమించి ఇంచార్జి  రిజిస్టర్ ఎదురుగానే జరగడం ఇన్ఛార్జ్ రిజిష్టర్  నిరంకుశత్వానికి మారుపేరుగా చెప్పొచ్చు. 

 

 

 ఓ వైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సమ న్యాయం చేస్తూ పారదర్శక పాలన అందిస్తున్నారు. అందరికీ మెరుగైన విద్య అందేలా చర్యలు చేపడుతున్నారు. కానీ ఇలాంటి వారి వల్ల మెరుగైన విద్య కాదు కదా... కనీస క్రమశిక్షణ కూడా రాదు  అని భావిస్తున్నారు ప్రజలు. ఘన చరిత్ర కలిగిన ఎస్వీయూ  లో ఒక వికలాంగుడిపై దాడి చేయటంతో ఎస్వీ యూనివర్సిటీ మాయని మచ్చ పడుతుందని తెలిసిన... నవ్విపోదురు గాక నాకేంటి   అన్నట్లుగా ఉంది ఇంచార్జ్ సార్ గారి తీరు. 

 

 

 అయితే ఈ ఘటన జరిగి పది రోజులు అవుతున్నా... ఇంచార్జ్ రిజిష్టర్   ఇంకా స్పందించకపోవడం సిగ్గుచేటు. దీంతో ఎస్వీయూ ప్రతిష్ట పై కనీస బాధ్యత ఇన్చార్జి రిజిష్టర్ కి  లేదా అని ప్రశ్నిస్తున్నారు ఎస్వియూ  విద్యార్థులు. ఎంతో కీర్తిప్రతిష్టలు కలిగిన ఎస్వియు కి అప్రతిష్ట తెచ్చేవిధంగా ఇంచార్జ్ రిజిస్టర్ తీరు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంచార్జ్ రిజిస్టర్ సారు... ఇకనైనా మార్చుకుంటే బాగుంటుంది మీ తీరు అని భావిస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు.

మరింత సమాచారం తెలుసుకోండి: