ప్రపంచం కళ్లు తెరవకముందే భారతదేశం మేధస్సుని నిండా సంతరించుకుంది తరువాత కాలంలో విశ్వగురువుగా నిలిచి ఆదర్శప్రాయమైంది. భారతదేశంలో లేని మేధస్సు లేదు, ఇక్కడ చూడని విద్య లేదు. గురువు అంటే భారత్. అటువంటి భారతదేశంలో విశ్వవిద్యాలయాలకు ఎంతో విశిష్టత ఉంది నలందా తక్షశిల విశ్వవిద్యాలయాలు పురాతన కాలంలో చదువుల తల్లికి నిలయాలుగా మెలిగాయి, వెలిగాయి. 


అటువంటి గొప్పతనం సంతరించుకున్న విశ్వవిద్యాలయాల తీరు ఇపుడు మారిపోయింది. ఎలా అంటే అసలు అక్కడ చదువు సక్రమంగ చెప్తున్నారా అన్న సందేహాలు కలగడం సహజం. కులాల ప్రాతిపదికన అక్కడ పదవుల పంపిణీకి  పాలకులు ఏనాడైతే నిర్ణయించారో కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం ఇల్లా అన్ని రకాలైన రుగ్మ‌తలు వచ్చేశాయి.


నిజానికి ర్యాగింగ్ అన్నది విశ్వవిద్యాలయాల‌కు పట్టిన అసలు జబ్బు. దానికి తోడు మెదళ్ళలో ఉన్న బూజును వదలకుండా పట్టుకుని వేలాడుతూ వ్యవస్థను భ్ర‌ష్టు పట్టిస్తున్న ఆపర‌ మేధావులు ఇపుడు ఎక్కువమంది కనిపిస్తున్నారు. దానికీ అచ్చమైన ఉదాహరణగా ఎస్వీ యూనివర్శిటీని చెప్పుకోవాలి. అక్కడ అరాచకాలు ఎన్నో సమాజం ద్రుష్టికి రాకుండా పోతున్నాయి.


బాధ్యత కలిగిన వారంతా దిగజారి ప్రవర్తించడాన్ని చూస్తున్నారంతా. కులం పేరిట దూషణలు, వైకల్యాన్ని సైతం పరిహసించే స్థాయికి దిగిపోవడాన్ని చూసిన వారికి ఇది విశ్వవిద్యాయలమేనా అనిపించక మానదు. దీనికి సరైన సమాధానం చెప్పాలంటే మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందే. ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ నుంచి దిద్దుకురావాల్సిందే. మొత్తానికి మొత్తం కడిగిపారేయాల్సిందే. ఇది జాతి కోరుకుంటున్న డిమాండ్. గురువు స్థానం తగ్గితే అది జాతి వినాశనానికే చేటు అంటారు. అటువంటి చోట ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద  ఉంది. ఆ దిశగా అడుగులు  పడాలి  మరి చూద్దాం ఏం జరుగుతుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: