చదువుల తల్లి సిగ్గు పడుతోంది కదా వీరి చేష్టలకు. అక్కడ ఉన్న ప్రక్రుతి సైతం బిక్కచచ్చిపోతుంది కదా వీరి దాష్టికాలకు. ప్రశాంత వాతావరణంలో విద్య గరపాల్సిన విద్యార్ధులు సైతం వేదన పడకుండా ఉండగలరా ఈ రకమైన చర్యలను చూసి. పవిత్ర పుణ్య క్షేత్రం తిరుపతిలో  ఘనత వహించిన వర్శిటీ అది.


చెప్పించుకోవడం కాదు. బుద్దులు సుద్దులు చెప్పి సమాజాన్ని ఉన్నతంగా నడిపించాల్సిన బాధ్యత గల గురుతర స్థానంలో ఉన్న తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న దురాచారాలు చూసిన వారికి గుండె చెరువు కాక మానదు, అయ్యో విద్యాలయమా ఏమిటీ దుర్గతి అని కూడా విలపించకమానదు.


వికలాంగుడు అంటే ఆయన దివ్యాంగుడు. ఒక అవయవం దెబ్బ తింటే అంతకంటే దివ్యమైన అవయవాన్ని ఆ దేవుడు అతనికి ఇచ్చి ఉంటాడు. ఆ విధంగా చూస్తే అందరి కంటే గొప్పగా ఉంటాడనుకోవాలి. అటువంటి వికలాంగుని మీద ప్రతాపం చూపడానికి సార్లకు ఎలా మనసు ఒప్పింది అన్నదే ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే అందరూ మెదళ్ళ నిండా చదువులతో నిండిపోయిన వారే. అన్ని బుర్రలలో పుస్తకాలు  వేలకు వేలు దూరిపోయినవే.


మరి అన్ని చదువుకుని కూడా ఇంత దారుణంగా వికలాంగుడని చూడకుండా అవహేళన చేయడమేంటి. అంటే వారు నిజంగా చదువుకున్నారా. చదివితే ఆ చదువు ఏం నేర్పింది. సంస్కారం నేర్పలేదా. వారికి అన్ని రకాలుగా పదవులు ఇచ్చింది వాటిని వన్నె తెమ్మని కదా. కానీ జరుగుతున్నదేంటి. 


ఆ పదవులకే విలువ లేకుండా చేయడానికా. వికలాంగుడిని వేళాకోళం చేసిన ఘటన ఎస్వీ వర్శిటీలో ఆలస్యంగా వెలుగు చూడడం జరిగింది. అయినా చర్యలు లేవు అంటే అర్ధమేంటి. తప్పు చేసిన వారిని రక్షించడం ఇంకా పెద్ద తప్పు. మరి ఇది ఇలాగే సాగితే పరువు పోయింది ఎవరికి. యావత్తు సమాజానికి కాదా.


మరింత సమాచారం తెలుసుకోండి: