విద్యాలయాలు చదువు చెప్పటానికి మాత్రమే కాదు.. విజ్ఞానాన్ని ఇవ్వటానికి, సంస్కారం నేర్పటానికి, సమాజంలో జీవించేందుకు విలువలు నేర్పటానికి ఉన్నాయనేది సత్యం. ఎల్ కేజీ పాఠాలు చెప్పే టీచర్ అయినా.. యూనివర్శిటీలో పాఠాలు బోధించే ప్రొఫెసర్ అయినా ఇందుకు ఎవరూ మినహాయింపు కాదు. ఎల్ కేజీలో అ, ఆ.. లు దిద్దే చిన్నారులైనా విద్యా ప్రమాణాల గురించి చెప్పే విద్యావేత్తలైనా నిరంతర విద్యార్ధులే. ఇది ఎవరూ కాదనలేని సత్యం. కానీ ఓ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ విద్యా వ్యవస్థనే అపహాస్యం చేస్తున్నాడని అంటున్నారు.

 


ప్రతిష్టాత్మక ఎస్వీ యూనివర్శిటీలో ఇంచార్జి రిజిస్ట్రార్ ఓ వికలాంగునిపై తన పైశాచిక ప్రవర్తనతో యూనివర్శిటీ వ్యవస్థకే మచ్చ తెస్తున్నాడట. సదరు వికలాంగుడు యూనివర్శిటీకి సాంకేతికంగా పలు సేవలందిస్తున్నాడని సమాచారం. యూనివర్శిటీ ఇంచార్జి రిజిస్ట్రార్.. ఇతనిని తన ఛాంబర్ కే పిలిపించి మానసిక దాడికి పాల్పడుతున్నాడని సమాచారం. సమస్య ఏదైనా కానీ వికలాంగునిపై హేయమైన దాడి చేయటాన్ని అక్కడ ఎవరూ సమర్ధించలేకపోతున్నారట. విద్యావ్యవస్థకే మాయని మచ్చలా సదరు ఇంచార్జి రిజిస్ట్రార్ తీరు ఉందని అక్కడి సిబ్బందే అనుకుంటున్నారట. వికలాంగులంటే చిన్న పిల్లలతో సమానమని మర్చిపోయి.. వికలాంగులపై మాటల దాడి, చేతల దాడి చేయటం ఎంత హేయమైన పనో అంత పెద్ద పదవిలో ఉన్న రిజిస్ట్రార్ తెలుసుకోకపోవడం అక్కడి ప్రొఫెసర్లను విస్మయానికి గురి చేస్తోందట. యూనివర్శిటీ చదువు తర్వాత జీవితంలో స్థిరపడే విద్యార్ధులకు ఇటువంటి దాడులు చేస్తున్న రిజిస్ట్రార్ ఏం నీతి బోధించి సమాజంలోకి పంపిస్తాడని చెవులు కొరుక్కుంటున్నారట.

 


విద్యార్ధుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన యూనివర్శిటీలపై ఇటువంటి రిజిస్ట్రార్ల వల్లే చెడ్డ పేరు వస్తోందని అక్కడి సిబ్బంది చర్చించుకుంటున్నారట. అధికార దర్పంతో వ్యవహరిస్తున్న ఈ ఇంచార్జి రిజిస్ట్రార్ ఆగడాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలని కోరుకోని వారు ఆ యూనివర్శిటీలో లేరంటే ఆశ్చర్యమేనట.

 


మరింత సమాచారం తెలుసుకోండి: