ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలిసిందే.  ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి.  రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా పాక్ పై కఠినంగా వ్యవరించేందుకు ఇండియా సిద్ధమైంది.  పీవోకేను తిరిగి తీసుకోవడానికి పావులు కదుపుతున్నది.  అవసరమైతే సైనిక చర్య ద్వారా పీవోకే ను తిరిగి తీసుకోవడానికి సిద్ధం అవుతున్నది.  దానికోసమే ఇండియా ప్రయత్నం చేస్తోంది.  


ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా తో యుద్ధం చేస్తామని, కాశ్మీర్లో మానవహక్కుల ఉల్లంఘనకు ఇండియా పాల్పడుతుందని ఇప్పటికే అనేకమార్లు పాక్ పేర్కొన్నది.  అంతర్జాతీయ వేదికలపై ఇదే విషయాన్ని అనేకమార్లు స్పష్టం చేసింది.  కానీ, అంతర్జాతీయ దేశాలు ఒక్కటి కూడా పాక్ చెప్పే మాటలు వినడం లేదు.  ఇస్లామిక్ టెర్రరిజం పాక్ లోనే ఉందని, అక్కడి నుంచే ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారని, ఆ దేశమే ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని ప్రపంచ దేశాలు ఆరోపించాయి. 


యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.  ఈ విధమైన విషయాలను స్పష్టం చేయడం ద్వారా ఇండియా ప్రపంచదేశాల మద్దతును కూడగట్టగలిగింది.  ఇదిలా ఉంటె , హౌడీమోడీ సదస్సులో మోడీ తో కలిసి ట్రంప్ కూడా టెర్రరిజం గురించి మాట్లాడారు.  టెర్రరిజంపై పోరాటం చేస్తామని చెప్పారు.  బోర్డర్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉంటామని చెప్పారు.  


ఇదిలా ఉంటె, నిన్నటి రోజున పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సమావేశం అయ్యారు.  ఆ తరువాత ట్రంప్ మళ్లీ కొన్ని వ్యాఖ్యలు చేశారు.  కాశ్మీర్ సమస్య క్లిష్టమైనదని, ఇరు దేశాలు కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  మధ్యవర్తిత్వం చేసే సత్తా తనకు ఉందని చెప్పారు.  ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మళ్ళీ దుమారం రేపుతున్నాయి.  ఇండియా మాత్రం ఈ విషయంలో మూడో దేశం అవసరం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: