మనం ఏ విషయాన్నైనా మాటల్లో చెప్పి తప్పించుకుంటాం తప్పించి చేతల్లో చూపించలేం.  చేతల్లో చూపని విషయాల గురించే ఎక్కువుగా మాట్లాడుతుంటారు.  అది చేస్తాం ఇది చేస్తాం.. అలా చేస్తాం ఇలా చేస్తామని గొప్పలు చెప్తుంటారు.  గొప్పలు చెప్పడం మనకు ఒక అలవాటుగా మారిపోయింది.  చెప్పిన గొప్పలు ఎప్పటికి అలాగే ఉంటాయి.  చేతల్లో చేసి చూపించడం చాల కొద్దిమందికి మాత్రమే సాధ్యం అవుతుంది.  అది ఏ విషయమైనా కావొచ్చు.  ఎలాంటి విషయాలు కావొచ్చు. 


అయితే, చాలామంది చాలా విషయాల గురించి మాట్లాడుతుంటారు.  కానీ, కొంతమంది మాత్రమే వాటిని చేతల్లో చేసి చూపుతుంటారు.  అలా చేతల్లో చేసి చూపించే వ్యక్తుల్లో ప్రధాని మోడీ ఒకరు.   ఏదైనా సరే ఒకవిషయాన్ని అనుకున్నారు అంటే అది ఎంతకష్టమైన సరే చేసి చూపుతారు. చేసి చూపడమే కాదు.. దాని ఆచరణలోకి కూడా తీసుకొస్తారు.  జమ్మూ కాశ్మీర్ విషయంలో తీసుకున్న నిర్ణయం, నోట్ల రద్దు సమయంలో తీసుకున్న నిర్ణయం, ట్రిపుల్ తలాక్ విషయం, ప్లాస్టిక్ నిషేధం, ఇప్పుడు పర్యా వరణం.  


పర్యావరణం సంరక్షణ విషయంలో ఇప్పటి వరకు ప్రతి దేశం మాట్లాడుతూనే ఉన్నది.  సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి.  మాట్లాడటం, నిర్ణయాలు తీసుకోడంతో మాత్రమే సరిపోతుంది.  అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు.  పర్యావరణంపై దేశాలు మాట్లాడుతున్నాయి కానీ, వాటిని ఆచరణంలో పెట్టడం లేదు.  పర్యావరణానికి ఇబ్బందులు కలిగించే ఉద్గారవాయువులను తగ్గించుకునే విధానం గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకున్నా వాటికి తగినట్టుగా అమలు జరగడం లేదు అని ప్రధాని మోడీ పర్వావరణ సదస్సులో పేర్కొన్నారు.  


ఇప్పటి వరకు ఈ విషయంపై మాట్లాడుకోవడమే జరిగిందని, ఇకపై చేతల్లో చూపించాలని, ప్రతి ఒక్కటి చేతల్లో చూపినపుడు దాని ఫలితాలు కనిపిస్తాయని పేర్కొన్నారు.  ప్రపంచదేశాలన్ని కలిసి పర్యావరణం కోసం పనిచేయాలని, మాటలు పక్కన పెట్టి చేతల్లో చేసి చూపుదామని మోడీ పిలుపునిచ్చారు.  కలిసి పనిచేస్తేనే ఫలితాలు వస్తాయని చెప్పారు.  పర్వావరణం ప్రస్తతం ప్రపంచంలో స్థాయికి మించి ముప్పు ఏర్పడింది.  ఇది ఇలాగే కొనసాగితే మరికొన్ని రోజుల్లో భూమి అంతం కాకా తప్పదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: