బెంగాల్లో జాదవ్ పూర్ విశ్వవిద్యాలయంలో కేంద్ర మంత్రి బాబుల్ పై విద్యార్థులు తిరగడటంతో అక్కడ ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  కేంద్ర మంత్రి బాబుల్ పై ఇలా విద్యార్థులు తిరగడటం వెనుక లెఫ్ట్ నేతల హస్తం ఉన్నది.  లెఫ్ట్ నేతల కనుసన్నల్లో జాదవ్ పూర్ విశ్వవిద్యాలయం నడుస్తున్నది అన్నది ఆరోపణలు.  ఈ విషయాలు పక్కన పెడదాం.  2021లో బెంగాల్ రాష్ట్రానికి ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి విజయం సాధించాలని చూస్తున్నది దీదీ.  


లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే క్షీణదశకు వచ్చాయి.  1977 నుంచి స్ట్రాంగ్ గా 25 ఏళ్లపాటు బెంగాల్ ను ఏలిన లెఫ్ట్ పార్టీలు పదేళ్ల క్రితం అధికారాన్ని కోల్పోయాయి.  మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చింది.  అధికారంలోకి వచ్చిన మమతా సంచలన నిర్ణయాలు తీసుకుంది చురుగ్గా అడుగులు వేసింది.  అయితే, 2014లో బీజేపీ పోటీ చేసి బెంగాల్లో రెండు ఎంపీ సీట్లు  గెలుచుకుంది.  బెంగాల్లో అడుగుపెట్టాలి అనుకున్న బీజేపీ కలకు ఓ అడుగు పడింది.  


ఇదే బీజేపీకి కలిసి వచ్చింది.  అధికారం చేజిక్కించుకోవచ్చు అన్నది ఎప్పటికైనా నిజం అవుతుంది అనే నమ్మకం కుదిరింది.  ఆ దిశగానే అడుగులు చేసింది.  ఆ తరువాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 18 పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకోవడం విశేషం.  2014లో రెండు స్థానాలు సాధిస్తే 2019లో 18స్థానాలు సాధించింది.  ఇది చెప్పుకోదగ్గ పరిణామం అనే చెప్పాలి.  అలానే ఆ రాష్ట్రంలో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 4 స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంది.  


అప్పటి వరకు బెంగాల్ లో మమతాకు లెఫ్ట్ పార్టీల నుంచి పోటీ వస్తుంది అనుకుంటే.. అనూహ్యంగా బీజేపీ పుంజుకోవడంతో పాటి ఏమరుపాటుగా ఉంటె అధికారం లాగేసుకుంటుంది అనే డౌట్ వచ్చింది.  దీంతో మోడీపై బహిరంగంగా విమర్శలు చేయడం మొదలు పెట్టింది.  మోడీని డైరెక్ట్ గా విమర్శలు చేస్తున్నది.  ఎవరు ఏమననుకున్నా సరే ఆమె విమర్శలు మాత్రం ఆగడం లేదు.  విమర్శలు చేస్తూనే ఉన్నది.  పైగా ఎన్ఆర్సి తీసుకొస్తామని బీజేపీ చెప్తుంటే దానికి మమతా ససేమిరా అంటోంది.  కారణం ఎన్ఆర్సిని తీసుకొస్తే.. అది మమతకు చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: