పవన్ కళ్యాణ్ .. టీడీపీ మనిషేనని తనకు తాను ఆ ముద్ర వేయించుకున్నాడని చెప్పాలి. అధికారంలో ఉన్న చంద్రబాబును ప్రశ్నించకుండా .. జగన్ ను తిడుతున్నప్పుడే పవన్ మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు కూడా జగన్ ను మాత్రమే టార్గెట్ చేస్తూ .. బాబు గారి మీద ఈగ కూడా వాలనివ్వడం లేదు. తాజాగా గ్రామ సచివాలయాల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు మరియు పవన్ స్పందన ఒకే విధంగా ఉంది. చంద్రబబు వ్యాఖ్యలు ఇప్పటీకే అభ్యర్థుల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబుకు పవన్ తోడుగా వచ్చారు. గత ఐదేళ్లలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును తిట్టకుండా .. ప్రతి పక్షములో ఉన్న జగన్ ను తిట్టడంతో ఎన్నికల్లో పవన్ ఘోర ఓటమిని చవిచూశారు. అయితే ఇప్పుడు కూడా పవన్ తన పంథాను మార్చుకోలేదు. 


వైసీపీ 100 రోజుల పరిపాలనలో పవన్ మేధావి పెద్ద బుక్ ను ప్రచురించారు. టీడీపీ ఐదేళ్లలో నోరెత్తని ఈ మేధావి ఇప్పుడేదో రాష్ట్రంలో ఘోరం జరిగిపోతున్నట్టు పచ్చ మాటలు మాట్లాడ్తున్నారు. జగన్ వంద రోజుల పాలనలో ప్రజల సంక్షేమం కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. కానీ వీటిని మెచ్చుకునే నైజం పవన్ మేధావికి లేదు. క్లీన్ పాలిటిక్స్ అంటూ అందరి మాదిరిగానే డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు. రాజధాని వ్యవహారంలో అతిగా స్పదించి టీడీపీ .. నేను ఒకటేనని సిగ్నల్స్ పంపిస్తున్నారు. జగన్ చేసిన మంచి పనులు మెచ్చుకోకుండా అదేపనిగా టీడీపీ మాదిరిగా విమర్శలకు దిగుతున్నారు.


దీనితో జనసేన ఇంకా ఘోరమైన స్థితిలోకి పోతుంది. ఎన్నికల్లో జనసేన ఓటమితో ఏపీలో జనసేన రేంజ్ ఏంటో తెలిసి పోయింది. చివరికి అధినేత కూడా రెండు చోట్ల ఓడిపోవటంతో ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. ఇన్ని రోజులు ఆ పార్టీని నమ్ముకున్న వాళ్లు ఇంకా ఆ పార్టీని నమ్ముకుని కష్టపడే పరిస్థితిలో ఎవరు లేరని చెప్పాలి. జనసేన దాదాపు అన్ని స్థానాల్లో .. ఏదో కొన్ని స్థానాలు తప్పిస్తే .. డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి.  

మరింత సమాచారం తెలుసుకోండి: