వైకాపాలో మార్పులు జరగబోతున్నాయా అంటే అవుననే అంటున్నారు.  ప్రస్తుతం జగన్ ముఖ్యమంత్రిగా ఉంటున్నారు.  రాష్ట్ర సమస్యలపై పోరాటం చేస్తున్నారు.  ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ప్రముఖంగా ఉద్యోగం, విద్య, ఉపాధి, పింఛన్, రైతులకు భరోసా వంటివి ఇప్పటికే కొన్నింటిని అమలు చేశారు.  మిగతా విషయాలు అమలు చేసేందుకు పని చేస్తున్నారు.  అమలు చేయడంలో ఎంతవరకు సఫలం అయ్యారు అనే విషయం పక్కన పెడితే.. వర్క్ మాత్రం జరుగుతూనే ఉన్నది.  


జగన్ అధికారంలోకి వచ్చిన  తరువాత వర్షాలు కురుస్తున్నాయి.  మంచి శుభవార్తే.. బాగానే ఉన్నది.  అయితే, ఆ నీటిని నిల్వచేసే మార్గాలు మాత్రం కనిపించడం లేదు.  పోలవరం ప్రాజెక్ట్ పూర్తయి ఉంటె చాలామేరకు నీరు వృధా కాకుండా అడ్డుకునే వాళ్ళు.  కానీ, అక్కడ ఆ పరిస్థితులు కనిపించడం లేదు.  నీరు వృధాగా అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు పనుల్లోజాప్యం జరుగుతున్నది.  ఇది వేరే విషయం అనుకోండి.  వైకాపా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జగన్, పార్టీని ముందుండి నడిపిస్తున్నారు.  


ఇటు పార్టీ అధ్యక్షుడి హోదాలో... అటు ముఖ్యమంత్రిగా రెండు పనులు చేయాలి.  అందుకోసం పార్టీలో కొంతమేర పనులు తగ్గించుకోవాలని చూస్తున్నారు.  దానికోసం పావులు కదుపుతున్నారు.  ఇందులో భాగంగానే ఇప్పటి వరకు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్  ను నియమించలేదు.  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని షర్మిలకు ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  


గతంలో పార్టీ కోసం షర్మిల చాలా కృషి చేసింది.  అన్న జైలులో ఉండగా పార్టీకి పనిచేసింది.  జగన్ కోసం పాదయాత్ర చేసింది.  జనాల్లోకి వెళ్ళింది.  అలానే పార్టీని గెలిపించేందుకు చాలా వరకు కృషి చేసింది.  గతంలో తెలంగాణాలో వైకాపాకు ప్రెసిడెంట్ గా నియమిస్తారని అనుకున్నారు.  కానీ, ప్రస్తుతం పార్టీ ఏపీ పై మాత్రమే దృష్టి పెట్టింది. కాగా, ఇపుడు జగన్ చెల్లెలు షర్మిలకు పార్టీలో కీలక పదవి ఇవ్వాలని అనుకున్నారు.  అందుకే ఆమెకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వబోతున్నారని సమాచారం.  ఇందులో ఎంతవరకు నిజం ఉందని త్వరలోనే తెలుస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: