ఈ రోజుల్లో  రోజువారి జీవితంలో ఒక భాగమైపోయింది వాట్సాప్. ఏ సమాచారం పంపాలన్న వాట్సాప్... ఏ సమాచారం పొందాలన్న వాట్సాప్. ఇలా వాట్సాప్ యుగం  నడుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటి కాలం లో డైరెక్ట్ గా మాట్లాడటం కంటే వాట్స్అప్ కాల్ లో మాట్లాడడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. అంతలా ప్రభావితం చేసింది వాట్సాప్. ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని  మనిషి లేడు అన్నది ఎంత నిజమో... వాట్సాప్ వాట్సాప్ లేని  స్మార్ట్ ఫోన్ లేదు అన్నది కూడా అంతే నిజం. అయితే వాట్సాప్ వినియోగదారులకు  ఇప్పుడు ఏదో ఒక కొత్త ఫీచర్స్ అందిస్తూ ఉంటుంది వాట్సాప్ . ఈ మార్పులన్నీ కూడా వినియోగదారులు నచ్చే మెచ్చే విధంగా ఉంటాయి. ఈ కొత్త ఫీచర్స్ అన్ని వాట్సప్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు ఉపయోగపడతాయి. 

 

 

 అయితే ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వాట్సప్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుండే  వాట్సాప్... ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్ ను  అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా కేవలం వాట్సాప్ ని కాదు ఫేస్బుక్ ని కూడా ఎక్కువగా వాడేస్తారు మరి. ఇంతకీ కొత్త ఫీచర్ ఏంటంటారా...  ప్రస్తుతం వాట్సాప్ లో పెట్టే స్టేటస్ మీ ఫోన్లో కాంటాక్ట్ లో ఉన్న ఫ్రెండ్స్ మాత్రమే చూడగలరు. కామెంట్స్ చెయ్యగలరు. ప్రస్తుతం వాట్సాప్ యూజర్ల కోసం ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్ తో ఇప్పటివరకు వాట్సాప్ ద్వారా   మాత్రమే కాదు...  వారి స్టేటస్ ని ఇప్పుడు డైరెక్ట్ గా ఫేస్బుక్ స్టేటస్ లో కూడా మార్చుకోవచ్చు. 

 

 

 దీంతో ఓన్లీ మీ కాంటాక్ట్స్ లో ఉన్న ఫ్రెండ్స్ మాత్రమే కాకుండా మీకు టచ్లో లేనని  ఫ్రెండ్స్ కూడా మీ వాట్సాప్ స్టేటస్ మీ చూడగలరు. మరో కొత్త ఫీచర్ ఏంటంటే... ఇప్పటివరకు వాట్సాప్ యూసర్ లు ఎవరి స్టేటస్ అయినా చూడకూడదు అనుకుంటే మ్యూట్లో పెట్టేవారు... మ్యూట్ చేసిన వారి స్టేటస్ లు వాట్సాప్ లో మనకి కనిపించవు . కానీ ఇప్పుడు వచ్చిన కొత్త ఫీచర్ ద్వారా మ్యూట్  చేసిన స్టేటస్ లను మొత్తం తొలగించకుండా బ్లర్ చేసి  బూడిద రంగులో  లైట్ గా  కనిపిస్తుంటుంది. అయితే త్వరలో ఈ కొత్త ఫీచర్ కూడా అందుబాటులోకి తేవడానికి వాట్సాప్  దృష్టిసారిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: