రివర్స్ టెండరింగ్.. గత ప్రభుత్వం తమ వాళ్లు అనుకున్నవాళ్లకు అడ్డగోలుగా కట్టబెట్టిన వందల కోట్ల ప్రాజెక్టలు వ్యవహారాన్ని ఏపీ సీఎం జగన్ బట్టబయలు చేస్తున్నారు. ఎవరేమన్నా పట్టించుకోకుండా ముందుకెళ్లిన ఆయన ధైర్యానికి ఇప్పుడు ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం సద్వినియోగం అవుతోంది.


రివర్స్ టెండరింగ్ ఐడియాతో తాజాగా పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వానికి 628 కోట్లు ఆదా అవుతోంది. అంచనాలు పెంచి పనులు చేయకుండా మూడేళ్లు కాలయాపన చేసిన ట్రాన్స్ ట్రాయ్ కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఎల్ 1గా వచ్చిన ఆ సంస్థ కోట్ చేసిన మొత్తాన్ని ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణిస్తూ రివర్స్ టెండరింగ్ కు పిలుపునిచ్చింది. ఫలితంగా పోలవరం పనుల్లో అధిక వ్యయాన్ని కంట్రోల్ చేసినట్టైంది.


పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది. ట్రాన్సపరెంట్ గా జరిగిన బిడ్డింగ్లో 12.6% తక్కువ కోట్ చేసి మేఘా ఇంజనీరింగ్ పోలవరం పనులను దక్కించుకుంది. 4957 కోట్ల రూపాయిల విలువగా గత ప్రభుత్వం నిర్ణయించిన పనులను 4358 కోట్ల రూపాయిలకే కోట్ చేసింది మేఘా ఇంజనీరింగ్. ఇది అసలుసిలైన నమ్మకమైన పోటీ అనిపించుకుంది.


రికార్డు టైమ్ లో పట్టిసీమ నిర్మాణం చేసి, తెలంగాణాలో భారీ బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్నినిర్మిస్తున్నప్రతిష్టాత్మక మేఘా ఇంజనీరింగ్ కోర్టు అనుమతులు లభించిన వెంటనే పోలవరం పనులను ప్రారంభించనుంది. ప్రభుత్వం నిర్థారించిన ప్రమాణాలన్నిటినీ పాటిస్తూ నాణ్యతలో రాజీ లేకుండా పోలవరం పనులను సకాలంలో పూర్తి చేసే బాధ్యతలు తీసుకుంటోంది మేఘా ఇంజనీరింగ్. ఏదైనా తాను నమ్మితే ఎందరు వ్యతిరేకించా ముందుకే వెళ్లే తత్వం వైఎస్ జగన్ ది. బహుశా అది తండ్రి నుంచి వచ్చిన వారసత్వం కావచ్చు. పోలవరం ప్రాజెక్టుల్లో వందల కోట్లు మిగిలినా భద్రతకు ఢోకా లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: