ఈ నెల సెప్టెంబర్ 1 న ప్రారంభమైన కొత్త వాహన చట్టం మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తుంది. హెల్మెట్ లేకున్నా, సీటు బెల్టు లేకున్నా ఒకప్పుడు 100 రూపాయలు ఫైన్ ఉండేది ఇప్పుడు ఏకంగా వెయ్యి రూపాయలు, రెండు వేల రూపాయిలు ఫైన్ వేసి మీ జాగ్రత్త కోసమే ఈ ఫైన్ అంటూ బెంబేలెత్తిస్తుంది కేంద్రం. భారీ జరిమానాలను తట్టుకోలేక ఎక్కువ టెన్షన్ పడి పోలీసుల ముందే గుండెపోటుతో గుజరాత్ ఓ యువకుడు మరణించిన విషయం తెలిసిందే. 


అయితే ఈ కొత్త ట్రాఫిక్ చట్టం వల్ల చాలామంది వారి జరిమానాలు కట్టలేక వారి వాహనాలను పోలీసుల ముందే కాల్చి పడేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా రాష్ట్రాల గవర్నమెంట్ లు కొత్త ట్రాఫిక్ చట్టం మధ్య తరగతి ప్రజలకు అతి భారం అని కొన్ని రాష్ట్రాల్లో ఈ ట్రాఫిక్ చట్టాన్ని రద్దు చేస్తే మరికొన్ని రాష్ట్రాల్లో ఈ ట్రాఫిక్ చట్టం జరిమానాలు భారీగా తగ్గించారు.  


ఈ తరహాలోనే ఏపీ ప్రభుత్వం కూడా వాహనదారులకు ఈ జరిమానాలు విషయంలో భాదను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రాఫిక్ రూల్స్‌ను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధించే ఆలోచనలో జగన్ ప్రభుత్వం లేదని సమాచారం. కొత్త మోటారు వాహన చట్టం, జరిమానాలు గురించి మొదట ప్రజల్లో అవగాహనా తీసుకురావాలని, ఆతర్వాత ఇలాంటి భారీ జరిమానాలు విధించాలని జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుందట. 


కాగా ఇప్పుడు ఉన్న భారీ ఫైన్లపై ఒకసారి అధ్యయనం జరిపి ఆమోదయోగ్యమైన జరిమానాలు సూచించాలని రవాణా అధికారాలను జగన్ ఆదేశించారని సమాచారం. జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా అధికారుల కమిటీ జరిమానాల నివేదికను పంపారట. ఆ జరిమానా నివేదిక ఇదే... 


రోడ్డు నిబంధన అతిక్రమిస్తే – కేంద్రం రూ.500 (జగన్ ప్రభుత్వం రూ.250) 


లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే – కేంద్రం రూ.5000 (జగన్ ప్రభుత్వం రూ.2500)


అర్హత లేకుండా వాహనం నడిపితే –కేంద్రం రూ.10,000 (జగన్ ప్రభుత్వం రూ.4000)


ఓవర్ సైజ్డ్ వాహనాలు – కేంద్రం రూ.5000 (జగన్ ప్రభుత్వం రూ.1000)


డేంజరస్ డ్రైవింగ్ – కేంద్రం రూ.5000 (జగన్ ప్రభుత్వం రూ.2500)


డ్రంక్ అండ్ డ్రైవ్ – కేంద్రం రూ.10,000 (జగన్ ప్రభుత్వం రూ.5000)


సీట్ బెల్ట్ – కేంద్రం రూ.1000 (జగన్ ప్రభుత్వం రూ.500)


ఇన్సూరెన్స్ లేకుంటే – కేంద్రం రూ.2000 (జగన్ ప్రభుత్వం రూ.1250) 


మరింత సమాచారం తెలుసుకోండి: