రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వానికి 628 కోట్లు ఆదా అయ్యిందని ప్రభుత్వం చెబుతోంది. అంచనాలు పెంచి పనులు చేయకుండా మూడేళ్లు కాలయాపన చేసిన ట్రాన్స్ ట్రాయ్ కాంట్రాక్టును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేశామంటోంది. ఎల్ 1గా వచ్చిన ఆ సంస్థ కోట్ చేసిన మొత్తాన్ని ప్రాథమిక అంచనా వ్యయంగా పరిగణిస్తూ రివర్స్ టెండరింగ్ కు పిలుపునిచ్చింది. ఫలితంగా పోలవరం పనుల్లో అధిక వ్యయాన్ని కంట్రోల్ చేశామంటోంది.


తాజా రివర్స్ బిడ్డింగ్లో 12.6% తక్కువ కోట్ చేసి మేఘా ఇంజనీరింగ్ పోలవరం పనులను దక్కించుకుంది. 4957 కోట్ల రూపాయిల విలువగా గత ప్రభుత్వం నిర్ణయించిన పనులను 4358 కోట్ల రూపాయిలకే కోట్ చేసింది మేఘా ఇంజనీరింగ్. దీని ద్వారా మొత్తం 630 కోట్ల వరకూ ఆదా అయ్యాయి. మొన్న వేరే రివర్స్ టెండరింగ్ లో మరో 58 కోట్లు ఆదా అయ్యాయి. ఇలా వందల కోట్లు ఆదా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.


కానీ విపక్షం టీడీపీ వాదన మరీ విచిత్రంగా ఉంది.. రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా కాదు.. వేయి కోట్ల నష్టం వస్తోందని చెబుతోంది. తెలుగుదేశం నేతలు తమాషా వాదనలు చేస్తున్నారు. టిడిపి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర దీనిపై మీడియాతో మాట్లాడారు. పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల అదనంగా వెయ్యి కోట్ల భారం పడుతుందని విచిత్ర వాదన చేశారు.


విద్యుత్ ప్రాజెక్టు ఆలస్యం వల్ల ప్రభుత్వంపై రూ.1000 కోట్ల భారపడుతుందన్నారు. జీవో నెంబర్ 67 నిబంధనలకు విరుద్ధంగా ఒకే సంస్థకు పనులు కట్టబెట్టారని విమర్శించారు. వివిధ మార్గాల్లో రూ.300 కోట్ల మినహాయింపులు కాంట్రాక్టు కంపెనీకి ఇచ్చారని ధూళిపాళ్ల ఆరోపించారు. ఏ విశ్వసనీయతతో మేఘా సంస్థకు పనులు అప్పగించారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంపై విశ్వసనీయత లేకనే ఒక్కటే బిడ్‌ వచ్చిందని నరేంద్ర అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: