దేశానికి ప్రధాన మంత్రి అంటే నిత్యం ఊపిరిపీల్చుకోలేనంతగా ఆలోచనలు,సమస్యలు చుట్టూ వుంటాయి.ఎన్ని ఆలోచనల్లో వున్న అప్పుడప్పుడు వారిలోవున్న హస్యచతురత బయట పడుతుంది.ఇక నవ్వులు పూయించేలా,మాట్లాడటం,గాట్లు పడేలా చురకలంటించడం మోదీ గారికి బాగా తెలుసు.దానికి సంబంధించిన సంఘటన జరిగింది.ఇక హెడ్ లైన్ చూసి మోదీ క్షమాపణలు చెప్పడం ఏంటని ఆలోచిస్తున్నారా.సరదాగా జరిగిన విషయం ఇది.



అమెరికాలోని హ్యూస్టన్‌ వేదికగా ఆదివారం అట్టహాసంగా జరిగిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో చోటుచేసుకున్న ఆసక్తికర సంఘటన తాలుకు సంబాషణ.ఇక జరిగిందేంటంటే. సెనేటర్‌ జాన్‌ కార్నీ సతీమణి శాండీకి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు.యాదృచ్ఛికంగా ఆమె పుట్టిన రోజునాడే ‘హౌడీ మోదీ’ కార్యక్రమం నిర్వహించినప్పటికీ..ఆ దంపతులిద్దరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.శాండీతో ప్రధాని మాట్లాడుతూ..ఇవాళ మీ పుట్టిన రోజు కాబట్టి నేను మీకు క్షమాపణ చెబుతున్నాను.మీ జీవిత భాగస్వామి ఇవాళ నాతో ఉన్నందుకు మీకు సహజంగానే అసూయ ఉంటుంది.మీకు అన్ని విధాలా మంచి జరగాలనీ...మీ జీవితం ఆనందమయంగా ఉండాలని కోరుకుంటున్నా...అని మోదీ పేర్కొన్నారు.దీంతో ఆమెతో పాటు మోదీ పక్కనే నిలబడి ఉన్న 67 ఏళ్ల సెనేటర్ కార్నీ కూడా నవ్వుతూ కనిపించారు.



దీని తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.ఇక ఈ సంఘటనను చూసిన నెటిజన్లు ప్రజల మనసును గెలవడం ఎలాగో మోదీకి బాగా తెలుసంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక సెనేటర్ జాన్ కార్నీ,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బృందంలో కీలకంగా ఉన్నారు 40 ఏళ్ల క్రితం ఆయన శాండీని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.దీంతో మోదీ పక్కనే నిలబడి ఉన్న 67 ఏండ్ల సెనేటర్‌ కార్నీ,ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ,నవ్వులు చిందించారు.ప్రస్తుతం ఈ వీడియోను ప్రధానమంత్రి కార్యాలయం ట్విట్టర్‌లో పోస్టు చేసింది....

మరింత సమాచారం తెలుసుకోండి: