మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా తెలుగుదేశంపార్టీకి ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు. ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డిపై అనేక అసత్యాలను ప్రచారం చేసింది. సొంతబాకాను బ్రహ్మండంగా ఊదుకుంటూ తన జబ్బలు తానే చరుచుకునే వారు చంద్రబాబునాయుడు. సరే ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూసిందే. 

 

అధికారంలో ఉన్నపుడు గోబెల్స్ ప్రచారాన్ని జనాలు తిప్పికొట్టారు. అందుకే వైసిపికి అఖండ మెజారిటిని ఇచ్చారు. దాంతో ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత కూడా టిడిపి గోబెల్స్ ప్రచారాన్నే నమ్ముకున్నట్లు కనబడుతోంది. అప్పుడు, ఇప్పుడు కూడా జగన్ పై విషప్రచారం చేయటమే టార్గెట్ గా చంద్రబాబు  పనిచేస్తున్నట్లు అర్ధమైపోతోంది. ఇక్కడే చంద్రబాబు చేస్తున్న తప్పులు అందరికీ విచిత్రంగా కనిపిస్తోంది.

 

ఇంతకీ విషయం ఏమిటంటే గ్రామ సచివాలయాల ప్రశ్నపత్రం లీకేజిపై రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు చంద్రబాబు నాలుగురితో ఓ కమిటిని వేశారు. ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ ఎల్లోమీడియా వరుసపెట్టి కథనాలను అచ్చేస్తోంది. ప్రశ్నపత్రం లీకైందని అచ్చేయం ఆలస్యం వెంటనే చంద్రబాబు, చినబాబు అండ్ కో రంగంలోకి దిగేసి రచ్చ చేయటం మొదలుపెట్టేశారు.

 

అసలు ప్రశ్నపత్రం లీకైందా లేదా అన్న విషయం ఇప్పటికీ అధికారికంగా బయటపడలేదు. లీకైందంటూ ఎల్లోమీడియానే పదే పదే కథనాలు ఇచ్చేస్తోంది. ఇక్కడ విషయం ఏమిటంటే ఎల్లోమీడియా, చంద్రబాబుకున్న బంధం అందరికీ తెలిసిందే. కాబట్టి లీకేజి  విషయాన్ని చాలామంది సీరియస్ గా తీసుకోలేదు. ఇక్కడే చంద్రబాబు తప్పు చేస్తున్నట్లు అర్ధమైపోతోంది. జనాల్లో లేని వ్యతిరేకత ఉందంటూ ప్రచారం చేస్తున్నారు.

 

జనాల్లో వ్యతిరేకత కానీ ఆందోళన కానీ స్వచ్చంధంగా మొదలవ్వాలి. వాళ్ళకు రాజకీయ పార్టీలు మద్దతుగా నిలబడాలి. అప్పుడే ఏ ఆందోళనైనా సక్సెస్ అవుతుంది. అలా కాదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా టిడిపినే ఆందోళన అని అంటోంది కాబట్టే పెద్దగా స్పందన లేదు. ఇప్పటి వరకూ జరిగిన నిరసన అంతా తెలుగుదేశంపార్టీ అనుబంధ సంఘాల నుండే కనిపిస్తోంది. నిజంగానే ప్రశ్నపత్రం లీకైందని అభ్యర్ధులు నమ్మి ఆందోళనలకు దిగినపుడే విలువుంటుంది. లేకపోతే మరో రాజకీయ రచ్చగా మిగిలిపోవటం ఖాయం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: